Home » వార్ 2 సినిమాను చేతులారా వ‌దులుకున్న ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్స్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు మిస్ చేసుకున్నారంటే..?

వార్ 2 సినిమాను చేతులారా వ‌దులుకున్న ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్స్ ఎవ‌రో తెలుసా..? ఎందుకు మిస్ చేసుకున్నారంటే..?

by AJAY

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్స్ క్రేజ్ మామూలుగా లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ వ‌స్తే చాల‌ని అనుకునేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ మ‌న స్టార్స్ ను రా ర‌మ్మ‌ని పిలుస్తోంది. దానికి కార‌ణం తెలుగు సినిమాలు ఇండియా వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకోవ‌డ‌మే. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ బాలీవుడ్ లోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

ALSO READ :సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై సోదరి ఆగ్రహం.. అందుకోసమేనా ? 

అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ లు కూడా బాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ రోష‌న్ హీరోగా న‌టిస్తున్న బాలీవుడ్ సినిమా వార్ 2 లో ఎన్టీఆర్ కు మరో హీరోగా ఛాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆఫ‌ర్ రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ కుషీ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందు ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ను అనుకున్నార‌ట‌.

అంతే కాకుండా మేక‌ర్స్ ప్ర‌భాస్ ను సంప్ర‌దించార‌ట‌. అయితే ప్ర‌భాస్ వ‌రుస సినిమాలతో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశార‌ట‌. అంతే కాకుండా వార్ సినిమా మేక‌ర్స్ ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కూడా అనుకున్నార‌ట‌. అయితే అది లైగ‌ర్ సినిమాకు ముందు.

లైగ‌ర్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను లైట్ తీసుకున్నార‌ని టాక్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు వ‌చ్చిన క్రేజ్ ఆయ‌న న‌ట‌న చూసి ఎన్టీఆర్ ను సంప్రాదించార‌ట‌. అంతే కాకుండా ఎన్టీఆర్ కు మేక‌ర్స్ 100 కోట్ల రెమ్యునరేష‌న్ ను ఆఫ‌ర్ చేసిన‌ట్టుగా టాక్ వినిపిస్తోంది.

ALSO READ :శాకుంత‌లం సినిమా ఫ‌స్ట్ రివ్యూ..స‌మంత మ‌రో హిట్ కొట్టిందా..?

Visitors Are Also Reading