Home » ద్రావిడ్ స్థానంలో కోచ్ గా లక్ష్మణ్..!

ద్రావిడ్ స్థానంలో కోచ్ గా లక్ష్మణ్..!

by Azhar
Ad

బీసీసీఐ ప్రస్తుతం భారత జట్టును రెండుగా చేసి ఒక్కేసారి రెండు పర్యటనలకు పంపిస్తున్న విషయం తెలిసిందే. మొదటి జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు అందరూ ఉంటే.. ఇక రెండో జట్టులో కొంతమంది సీనియర్ ఆటగాళ్లతో పాటుగా యువ ఆటగాళ్లను ఎంపిక చేస్తుంది. ఇప్పుడు కూడా అలానే చేసింది. మొదటి టీం ఇండియా అనేది ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన తర్వాత.. యువ ఆటగాళ్లతో కూడిన రెండో భారత జట్టును రెండు టీ20 మ్యాచ్ ల కోసం ఐర్లాండ్ కు పంపింది. ఇక ఈ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్య వ్యవరించగా.. హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తించాడు.

Advertisement

అయితే ఈ ఐర్లాండ్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసిన భారత యువ ఆటగాళ్లు అందరూ ఇంగ్లాండ్ కు చేరుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న మొదటి జట్టు ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. అది ఈ నెల 5న అంటే రేపు ముగుస్తుంది. కానీ మళ్ళీ ఒక్క రోజు గ్యాప్ తోనే ఇంగ్లాండ్ జట్టుతో టీ20 సిరీస్ అనేది ప్రారంభం అవుతుంది. అందువల్ల ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లకు అందరికి ఈ టీ20 సిరీస్ లో భాగమైన మొదటి మ్యాచ్ నుండి విశ్రాంతి అనేది కల్పించింది. ఇక ఐర్లాండ్ లో రాణించిన జట్టునే ఈ మొదటి మ్యాచ్ కు ఎంపిక చేసింది.

Advertisement

ఇక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినట్లే.. ఈ మ్యాచ్ నుండి మొదటి జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవరిస్తున్న రాహుల్ ద్రావిడ్ కు కూడా రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. అయితే ఈ మ్యాచ్ లో మొత్తం ఐర్లాండ్ తో మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లే ఉండటంతో ఈ మొదటి మ్యాచ్ కు ద్రావిడ్ స్థానంలో కోచ్ గా.. అక్కడ ఐర్లాండ్ లో ఆ బాధ్యతలు నిర్వర్తించిన వీవీఎస్ లక్ష్మణ్ నే నియమించింది. అక్కడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాణించిన ఈ యువ ఆటగాళ్లకు నమ్మకం, దైర్యం అనేది ఉండాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీతో గొడవపై షాకింగ్ కామెంట్స్ చేసిన బెయిర్ స్టో..!

పుజారాల ఆడేవాడు పంత్ మాదిరి ఆడాడు..!

Visitors Are Also Reading