Home » తాత్కాలిక కోచ్ గా లక్ష్మణ్ కే బాధ్యతలు..!

తాత్కాలిక కోచ్ గా లక్ష్మణ్ కే బాధ్యతలు..!

by Azhar
Ad

భారత జట్టులో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు అనేవి చూడటం జరుగుతుంది. ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్ పదవి నుండి, రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవి నుండి తప్పుకున్నారో అప్పటి నుండి జట్టులో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సిరీస్ సిరీస్ కు కెప్టెన్లు మారడం.. జట్టులో ఆటగాళ్లు మారిపోవడం జరుగుతున్నాయి. అలాగే జట్టు యొక్క హెడ్ కోచ్ లు కూడా మారుతున్నారు. ఇక ఇప్పుడు కూడా అదే జరిగింది.

Advertisement

ప్రస్తుతం టీం ఇండియా హెడ్ కోచ్ గా దురాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. అయితే ఇప్పుడు టీం ఇండియా ఆసియా కప్ కోసం యూఏఈకి వెళ్లగా.. అకాడమికి వెళ్లేముందు చేసిన కరోనా పరీక్షలో ద్రావిడ్ కు పాజిటివ్ గా వచ్చింది. దాంతో ద్రావిడ్ క్వారంటైన్ లోకి వెళ్ళాడు. అందువల్ల ఇప్పుడు టీం ఇండియాకు ఈ ఆసియా కప్ లో తాత్కాలిక హెడ్ కోచ్ గా ఎన్సీఏ అధ్యక్షుడు అయిన వీవీఎస్ లక్ష్మణ్ ను నియమించింది.

Advertisement

అయితే వీవీఎస్ లక్ష్మణ్ ఈ మధ్యే ఐర్లాండ్ కు వెళ్లిన భారత జట్టుతో పాటుగా.. జింబాంబ్వే పర్యటనలో కూడా ఇండియాకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. అందుకే అతనికే ఈ బాధ్యతలు ఇస్తునట్టు బీసీసీఐ ప్రకటించింది. అలాగే రాహుల్ ద్రావిడ్ కు కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ అతనే ఆ బాధ్యతలు తీసుకుంటాడు అని కూడా బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చింది. అంటే ద్రావిడ్ ఈ ఆసియా కప్ లో సూపర్ 4 స్టేజ్ వరకు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ కోసం కొత్త బ్యాట్ వడబోతున విరాట్..!

కోహ్లీ ముందు బాబర్ ఇంకా బచ్చా..!

Visitors Are Also Reading