Home » చిరంజీవి మీద వినాయక్ ఇండైరెక్ట్ కామెంట్స్ ! మూవీ ఫ్లాప్ అయితే డైరెక్టర్స్ ని బ్లేమ్ చేస్తున్నారు !

చిరంజీవి మీద వినాయక్ ఇండైరెక్ట్ కామెంట్స్ ! మూవీ ఫ్లాప్ అయితే డైరెక్టర్స్ ని బ్లేమ్ చేస్తున్నారు !

by Sravya
Ad

వివి వినాయక్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చాలామంది, టాప్ హీరోలతో మంచి సినిమాలను తెర మీదకి తీసుకొచ్చారు వినాయక్. తాజాగా ఆయన మాట్లాడిన విషయాలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఓటిటి అనేది డైరెక్టర్ల పాలిట శత్రువు అని అన్నారు. నాటకానికి సినిమా ఎలా శత్రువు అయిందో ఇప్పుడు సినిమాకి శత్రువు ఓటీటీ అయిందని అన్నారు. ఓటీటీ కి వచ్చాక సినిమా కళ్ళు తప్పిందని, ఒక సినిమా ఫ్లాప్ అయితే దర్శకుల గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని వినాయక్ అన్నారు. సినిమా హిట్ ఫ్లాప్ ప్రభావం దర్శకుల మీద ఉండడం అనేది మొదటి నుండి ఉంది.

Advertisement

అయితే ఇప్పుడు దర్శకుల గురించి దారుణంగా మాట్లాడుతున్నారని వినాయక్ చెప్పారు. ఒక కథ చెప్పినా సినిమా చేయాలన్నా కలెక్టివ్ గా అందరి నిర్ణయాలు తీసుకుని చేస్తాడు. ఏదైనా ఏకాభిప్రాయంతోనే చేస్తాడు అని అన్నారు కానీ సినిమా ఫ్లాప్ అయ్యిందంటే డైరెక్టర్ మీదకి తోసేస్తారు. హిట్ అయితే మాత్రం చాలా చిన్న భాగాన్ని ఇస్తున్నారు. కథలో కంటెంట్ ఉంటేనే చూడడం అనేది ఇప్పుడే కాదు.

Advertisement

ఎప్పటినుండో కూడా ఉంది అని వినాయక్ అన్నారు. ఓటిటి వచ్చిన తర్వాత కాస్త తగ్గినా సినిమా కొంచెం బాగున్నా థియేటర్లకి వస్తారు పెద్ద చిన్న తేడా లేదు. ఓటిటి అనేది దర్శకులకి శత్రువు అని చెప్పాలి. ఇప్పుడు ఓటీటీ కూడా దర్శకులకి శత్రువు. అందరూ వాళ్ళ ఫోన్ల లోనే సినిమా చూస్తున్నారు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది నెక్స్ట్ వీక్ ఎలాగూ వచ్చేస్తుంది కదా అని అనుకుంటారని ఓటీటీ వలన నష్టం తప్ప ఉపయోగం లేదని చెప్పారు. థియేటర్లకి వెళ్తుంటే ఇప్పుడు హిట్ సినిమాకి 20, 30 మంది వరకు ఉంటున్నారు అంతే అని ఇదివరకు థియేటర్స్లో పండగ వాతావరణం కనబడేదని వినాయక్ చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading