సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, డైరెక్టర్లు ఉంటారు. కానీ వారి అందరికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది. దర్శకులలో ఒక్కొక్కరు ఒక్కో జోనర్ సినిమాలు బాగా తీయగలరు అనే పేరు తెచ్చుకుంటారు. అలాగే హీరోలలో కూడా ఒక్కో హీరో ఒక్కో జోనర్ కు బాగా సెట్ అవుతారు అని అనుకుంటారు. అయితే అలా అనుకునేవారిలో ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ జోనర్ కు బాగా సెట్ అయ్యే హీరో ఎవరు అంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ముందుంటారు. ఈయన చేసిన మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు.
Advertisement
అలాగే దర్శకులలో కూడా ఇలాంటి కోనార్ సినిమాలు బాగా తీసేది ఇప్పుడు బోయపాటి శ్రీను. అందుకే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికి మూడు సినిమాలు రాగ.. మూడు సూపర్ హిట్ అయ్యాయి. అయితే బోయపాటి కంటే ముందు ఇలాంటి ఇమేజ్ అనేది దర్శకుడు వీవీ వినాయక్ కు ఉండేది. ఆయన కూడా బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి అనే సినిమా తీశారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అంతగా హిట్ కాకపోయినా కూడా మంచి సినిమాగా పేరు అంది తెచ్చుకుంది. అయిన కూడా మళ్ళీ బాలయ్య, వినాయక్ కాంబోలో మరో సినిమా అనేది రాలేదు.
Advertisement
అయితే అలా ఎందుకు ఈ కాంబోలో సినిమా అనేది మళ్ళీ రాలేదు అనే విషయంపై తాజాగా వీవీ వినాయక్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో వినాయక్ మాట్లాడుతూ.. చెన్నకేశవ రెడ్డి సినిమా తర్వాత మళ్ళీ బాలయ్యతో సినిమా చేయాలనీ అనుకున్నాను. కానీ పరిస్థితులు కుదరలేదు. అయితే మళ్ళీ ఈ మధ్యే జెంటిల్ మెన్ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు కథ అనేది కుదరలేదు అని వినాయక్ స్పష్టం చేసారు. అయితే ఇప్పుడు వినాయక్ నుండి ఏ సినిమాలు రావడం లేదు.. కానీ బాలయ్య మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి :