Home » జ‌నాల‌ను పిచ్చోళ్ల‌ని చేసిన మంచు విష్ణు…అదంతా రియాలిటీ షో అంటూ వీడియో రిలీజ్..!

జ‌నాల‌ను పిచ్చోళ్ల‌ని చేసిన మంచు విష్ణు…అదంతా రియాలిటీ షో అంటూ వీడియో రిలీజ్..!

by AJAY
Ad

రీసెంట్ గా మంచు విష్ణు మ‌నోజ్ లు ఫైట్ చేసుకున్నారంటూ ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. వీడియోలో మ‌నోజ్ అసిస్టెంట్ పై విష్ణు దాడి చేస్తున్న‌ట్టు క‌నిపించింది. కాగా మ‌నోజ్ చూడండి మా చుట్టాలు సన్నిహితుల ఇళ్ల పై ఇలానే దాడి చేస్తుంటాడు అంటూ చెబుతున్న‌ట్టు వాయిస్ వినిపించింది. ఇక ఈ వీడియో సోష‌ల్ మీడియా మారుమోగిపోయింది.

Advertisement

అంతే కాకుండా టీవీలో మంచు వారింట్లో కొట్లాట అనే పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో వార్త‌లు వ‌చ్చాయి. ఆ గొడ‌వ రెండు రోజుల పాటూ మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. అయితే ఇప్ప‌డు ఆ వీడియో ఓ రియాలిటీ షో కోసం అంటూ మంచు విష్ణు అటు మీడియాను ఇటు జ‌నాల‌ను ఫూల్స్ ను చేశాడు. మంచుస్ రియాలిటీ షో అంటూ వీడియోను విడుద‌ల చేశారు.

Advertisement

ఇక వీడియో మొద‌ట్లో న్యూస్ ఛాన‌ల్స్ లో అన్న‌ద‌మ్ముల గొడ‌వ పై వ‌చ్చిన క‌వ‌రేజ్ ను క్లిప్ లుగా చూపించారు. ఆ త‌ర‌వాత విష్ణు ఉద‌యం జిమ్ చేయ‌డం నుండి మీటింగ్ లో కూర్చోవ‌డం..మోహ‌న్ బాబు పూజ చేయ‌డం అంతే కాకుండా త‌మ పిల్ల‌లు ఆడుకోవ‌డం ఇలా కొన్ని సీన్ ల‌ను చూపించాడు.

అయితే ఈ వీడియోలో మ‌నోజ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అంతే కాకుండా మంచు ల‌క్ష్మి సైతం వీడియోలో క‌నిపించ‌లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్ లు సూప‌ర్ మీడియాను ఫూట్ చేశారు క‌దా అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Visitors Are Also Reading