Home » విశాల్‌ రత్నం ఫస్ట్‌ సింగిల్‌ ‘Dont Worry Da Machi’ వచ్చేసింది

విశాల్‌ రత్నం ఫస్ట్‌ సింగిల్‌ ‘Dont Worry Da Machi’ వచ్చేసింది

by Anji
Ad

తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకడు విశాల్. ఎప్పుడూ ఏదో ఒక సినిమా అప్‌డేట్‌తో అభిమానులు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తుంటాడు విశాల్‌. ఈ హీరో ప్రస్తుతం విశాల్‌ 34 తో బిజీగా ఉన్నాడు. రత్నం  టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ లుక్‌లో.. లారీలో నుంచి ఆవేశంతో దిగిన విశాల్‌ కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి చెండాడుతున్న స్టిల్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

Advertisement

తాజాగా మేకర్స్‌ రత్నం ఫస్ట్‌ సింగిల్‌ Dont Worry Da Machiను విడుదల చేశారు. వివేక రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో స్వయంగా పాడాడు. ఈ పాట నెట్టింటిని షేక్ చేస్తోంది. రత్నం ఇంట్రెస్టింగ్‌ లుక్‌, ఫస్ట్ షాట్‌ వీడియో గూస్‌ బంప్స్‌ తెప్పిస్తూ సినిమాపై క్యూరియాసిటీ అంచనాలు పెంచుతోంది. ఇక విశాల్‌ 34 అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌లో చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్‌ ఉన్న లుక్‌ మాస్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. విశాల్‌ కెరీర్‌లో మొదటి సారి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. డీఎస్పీ జర్నీతో డిజైన్‌ చేసిన విశాల్‌ 34 వీడియో ఒకటి ఇప్పటికే ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది.

Advertisement

 

మాస్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న రత్నం సినిమాకు హరి దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి, పూజ సినిమాల తర్వాత హరి-విశాల్‌ కాంబోలో మూడో సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. రత్నంలో ప్రియా భవానీ శంకర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతోంది. మరోవైపు తుప్పరివాలన్2 కూడా విశాల్‌ ఖాతాలో ఉంది.

Also Read :  వకీల్ సాబ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవడానికి కారణమేంటో తెలుసా ?

Visitors Are Also Reading