Home » వకీల్ సాబ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవడానికి కారణమేంటో తెలుసా ?

వకీల్ సాబ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవడానికి కారణమేంటో తెలుసా ?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందీలో అమితాబచ్చన్, తాప్సీ మెయిన్ లీడ్ లో వచ్చిన పింక్ మూవీని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా సక్సెస్ సాధించింది. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం కొట్టలేకపోయింది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని డీల్ చేయడంలో దర్శకుడు విఫలం చెందాడు.

Advertisement

పవన్ కళ్యాణ్ లాంటి ఓ స్టార్ హీరో దొరికినప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టాలి. కానీ ఇలాంటి సినిమాలు ఏంటి అంటూ పవన్ అభిమానుల నుంచి వేణు శ్రీరామ్ పై చాలా విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ముగ్గురు అమ్మాయిల కోసం న్యాయం పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ పోరాటం జన్యూన్ గా ఉంటుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని లెంత్ పెంచడానికి ఆయనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టడం.. అందులో  శృతిహాసన్ ను హీరోయిన్ గా పెట్టడం ఆయనకు ఫ్యామిలీ ఉండడం అనేది కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి.  అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఆయనకి ఫ్యామిలీ పెట్టకుండా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయి లో ఆకట్టుకునేది.

Advertisement

ఇలా సినిమా చేస్తే బాగుండేదని చాలామంది అభిమానులు వారి  అభిప్రాయాలను తెలియజేశారు. కానీ దర్శకుడు మాత్రం ఆ సినిమాలో ఫ్యామిలీ ని ఆడ్ చేసుకుని సినిమాని తెరకెక్కించాడు. ఇక దానివల్లనే  పింక్ సినిమాలో రిపీట్ అయిన మ్యాజిక్ ఈ సినిమాలో అంత పర్ఫెక్ట్ గా  సెట్ అవ్వలేదనే చెప్పాలి.  ఇదిలా ఉంటే..  ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ఏపీ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలా షూట్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

Also Read :  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్న సినీస్టార్స్ ఎవరో తెలుసా?

Visitors Are Also Reading