Home » SRH అందుకే ఈ సీజన్ లో ఓడిపోయింది.. వారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే..?

SRH అందుకే ఈ సీజన్ లో ఓడిపోయింది.. వారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే..?

by Azhar
Ad

ఐపీఎల్ లో గత ఏడాది దారుణంగా విఫలమైంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఆడిన 14 మ్యాచ్ లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దాంతో ఈ ఏడాది ఆ జట్టుపైన పెద్ద అంచనాలు ఎవరికీ లేవు. ఎందుకంటే ఆ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు వార్నర్, బేరిస్టో, రషీద్ ఖాన్ అందరూ బయటికి వెళ్లిపోయారు. అందుకే ఆ జట్టుకు మళ్ళీ చివరి స్థానం పక్క అనుకున్నారు అందరూ. అందుకు తగ్గట్లు గానే ఈ సీజన్ ను ఆరంభించింది.

Advertisement

కానీ మొదటి రెండు మ్యాచ్ లలో ఘోరమైన ఓటమి తర్వాత అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యింది. వరుసగా 5 మ్యాచ్ లలో విజయం సాధించింది. దాంతో ఈ ఏడాది టైటిల్ హైదరాబాద్ జట్టుదే అనుకున్నారు అందరూ. కానీ మేము మారలేదు.. అదంతా పై పై మెరుపులే అనే విధంగా మళ్ళీ వరుసగా 5 మ్యాచ్ లలో ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంది. అయితే సన్ రైజర్స్ ఈ ఐపీఎల్ లో ఓ పెద్ద తప్పు చేసింది అని.. అందుకే వారికీ ఈ పరిస్థితి అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. హైదరాబాద్ యాజమాన్యం వార్నర్ ను వదులుకోవడమే వారి కూటములకు కారణం అని చెప్పాడు.

Advertisement

సెహ్వాగ్ మాట్లాడుతూ… హైదరాబాద్ వార్నర్ ను వదులుకోకుండా ఉండాల్సిది. ఎందుకంటే అతను మ్యాచ్ విన్నర్. ఒకవేళ వార్నర్ లాగానే ఏ ఇండియన్ కెప్టెన్ గనక చేస్తే… మీరు అతడిని కూడా జట్టు నుండి తప్పిస్తారా అని ప్రశ్నించాడు. మీరు బెంగళూర్ జట్టునే చూడండి. వారు కోహ్లీ ఎన్ని మ్యాచ్లలో విఫలమైనా ఆడించారు. జట్టు గెలిచినా.. ఓడినా కోహ్లీని తీసేయలేదు. ఎందుకంటే అతను మ్యాచ్ విన్నర్ అని వారికీ తెలుసు అని సెహ్వాగ్ అన్నాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ అంత గొప్ప కెప్టెన్ కాదు అంటున్న సెహ్వాగ్.. ఎందుకంటే..?

ఐపీఎల్ లో మరో అంపైర్ తప్పిదం.. బలైన మాథ్యూ వేడ్..!

Visitors Are Also Reading