Home » చెన్నై తదుపరి కెప్టెన్ అతనే..!

చెన్నై తదుపరి కెప్టెన్ అతనే..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో దారుణంగా విఫలమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు ఏడాది వరుస పరాజయా లతో ప్లే ఆప్స్ రేస్ నుండి అధికారికంగా వైదొలిగిన రెండవ జట్టు గా నిలిచింది. అయితే గత ఏడాది వరకు చెన్నై జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన ధోనీ తన వారసునిగా రవీంద్ర జడేజాను ఎంపికచేశారు. దాంతో జడేజా కెప్టెన్సీలో ఈ ఐపీఎల్ సీజన్ ను ప్రారంభించిన చెన్నై జట్టు ఓటమిపాలైంది. జడేజా నాయకత్వంలో 8 మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి తన ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా చేసుకుంది. దాంతో జడేజా కెప్టెన్ బాధ్యతలను మళ్ళీ ధోనికే ఇచ్చాడు. ఇక చెన్నై జట్టు ఈ ఏడాది ప్లే ఆఫ్ కి వెళ్లడం లేదు అనడం కంటే ఆ జట్టు కెప్టెన్ ఎవరు అనే దానిపైన ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.

Advertisement

Advertisement

ఎందుకంటే… ధోనీ వచ్చే ఏడాది నుండి ఐపీఎల్ ఆడ బోడు అనే ప్రచారం ఎక్కువగా ఉంది. కాబట్టి ధోనీ లేకపోతే కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతుంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇచ్చాడు. ధోనీ తర్వాత చెన్నై జట్టు నడిపించే సామర్థ్యం ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు ఉంది అని పేర్కొన్నాడు. ఎందుకంటే గైక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే ధోని లో ఉండే ప్రతి కెప్టెన్సీ క్వాలిటీ రుతురాజ్ గైక్వాడ్ లో కూడా ఉంటుంది. సెంచరీ చేసిన డకౌట్ అయిన వికెట్ పడిన పడకపోయినా మ్యాచ్ గెలిచినా ఓడిన ధోనీ లాగే కూడా ఎప్పుడు ఒకేలా ఉంటాడు

అలాగే రుతురాజ్ గైక్వాడ్ కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా కెప్టెన్గా మంచి రికార్డు ఉంది. అలాగే అతను ఆటను అర్థం చేసుకోగలడు. మ్యాచ్ ఎలా సాగుతున్న అతను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. అయితే ధోని కి ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. కానీ అదృష్టం రుతురాజ్ కు ఉందో లేదో మాత్రం నాకు తెలియదు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ధోనీ తర్వాత చెన్నై జట్టు కెప్టెన్ ఎవరు అనేది నిర్ణయించే అధికారం కేవలం ఆ జట్టు యాజమాన్యంకు మాత్రమే ఉంది అన్ని సెహ్వాగ్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

అంబటి రాయుడు రిటైర్మెంట్.. క్లారిటీ ఇచిన చెన్నై..!

ఉమ్రాన్ కు టీం ఇండియాలో చోటు ఖాయం : గంగూలీ

Visitors Are Also Reading