Home » సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విరాట్ కొడుకు అకాయ్ ఏఐ ఫొటోలు..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విరాట్ కొడుకు అకాయ్ ఏఐ ఫొటోలు..!

by Anji
Ad

 స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ , అనుష్క  దంపతులు ఫిబ్రవరి 15వ తేదీన రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. వీరు పండంటి మగబిడ్డకు జన్యనిచ్చారు. పిల్లాడికి అకాయ్ అని పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు కూడా. అయితే ఎక్కడా కుమారుడి ఫోటోలు మాత్రం బయటపెట్టాలేదు. ఈ విషయంలో కోహ్లీ, అనుష్కలు ఇద్దరూ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వీరి మొదటి సంతానం వామికా ఫోటోను కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ చూపించలేదు. పబ్లిక్ ప్లేస్‌ల్లో కూడా ఆమెను తీసుకురాలేదు. ఇప్పుడు అకాయ్ విషయంలోనే ఇదే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

అయితే విరాట్ కోహ్లీ అభిమానుల మాత్రం ఎప్పటిలానే అకాయ్ ఫోటోలు చూడ్డానికి తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ క్రమంలో విరాట్ దంపతులు ఎలాగో పిల్లాడిని చూపించరు కదా అని..ఓ అడుగు ముందుకేసి ఏఐ సాయంతో ఫోటోలను క్రియేట్ చేసేశారు. కోహ్లీ, అకాయ్ కలిసి ఉన్న ఫోటోలు…మొత్తం ఫ్యామిలీ ఉన్న ఫిక్స్‌ను క్రియేట్ చేశారు. ఇందులో విరాట్, అకాయ్‌లు ఇద్దరూ ఇండియా జెర్సీ వేసుకున్న ఫోటో కూడా ఉంది.

Advertisement

విరాట్, అనుష్కలు తమ కుమారుడు అకాయ్‌కు  లండన్‌లో జన్మనిచ్చారు. ఈ కారణంగానే విరాట్ లండన్ టెస్ట్ సీరీస్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్-2024 ఫస్ట్ సీజ్‌కు కూడా దూరంగా ఉండనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ భార్య అనుష్క సెకండ్ డెలివరీ సవ్యంగా సాగలేదని…ఏవో అనారోగ్య సమస్యలున్న కారణంగానే డెలివరీకి లండన్‌ వెళ్ళారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విరాట్, అనుష్కలు మరికొంత కాలం లండన్‌లోనే ఉండనున్నారని…అందుకే కోహ్లీ ఐపీఎల్ ఫస్ట్ సీజన్‌కు హాజరు కాపోవచ్చని చెబుతున్నారు.

Also Read : జూనియర్ విరాట్ ‘అకాయ్’ పేరు అర్థం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading