Home » జూనియర్ విరాట్ ‘అకాయ్’ పేరు అర్థం ఏంటో తెలుసా ?

జూనియర్ విరాట్ ‘అకాయ్’ పేరు అర్థం ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న  విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. విరుష్క దంపతులు తమ కుమారుడికి అకాయ్ గా నామకరణం చేశారు. దీంతో అకాయ్ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఆ పేరు అర్థం ఏమిటో తెలుసుకునేందుకు నెటిజన్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్ తెగ సెర్చ్ చేయడం విశేషం.

అకాయ్ అనే పేరు అర్థం, ఆ పేరును ఎక్కడి నుంచి తీసుకున్నామనేది మాత్రం ఇంకా తెలియలేదు. కొందరూ అకాయ్ అర్థం ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. అకాయ్ అనేది హిందీ పదం కాయ నుంచి వచ్చింది. కాయ అంటే శరీరం అని అర్థం. అకాయ్ అంటే శరీరం కంటే ఎక్కువ కలిగిన వ్యక్తి అని అర్థం వస్తుందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అకాయ్ పేరు టర్కిష్ మూలానికి చెందినది. దాని ప్రకారం.. అకాయ్ అంటే ప్రకాశించే చంద్రుడు అని అర్థం వస్తుంది. మరోవైపు అనుష్క, కోహ్లీ పేర్ల మొదటి అక్షరాల నుంచి తీసుకొని ఆ పేరు పెట్టినట్టు కొందరూ కామెంట్స్ చేస్తున్నారు.

కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు అకాయ్ రెండో సంతానం. తొలి సంతానంగా 2021లో వామిక జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం వస్తుంది. పార్వతీదేవికి మరో పేరు వామిక. వాకాయ్ అనే పేరు అసలైన అర్థం విరాట్ కోహ్లీ లేదా అనుష్క స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.

Also Read :  పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు.. పేరు ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading