Home » Virat Kohli : RCB కీలక నిర్ణయం…కోహ్లీకి మళ్ళీ కెప్టెన్సీ ?

Virat Kohli : RCB కీలక నిర్ణయం…కోహ్లీకి మళ్ళీ కెప్టెన్సీ ?

by Bunty
Ad

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లీ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది. ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు కారణం అవుతుంది. మరోసారి విరాట్ కెప్టెన్సీ గురించి చర్చ జరిగేలా చేస్తుంది. ఆర్సిబిని కింగ్ లీడ్ చేస్తే ఆ ఊపు వేరుగా ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతకు మించిన ఆనందం ఏముంటుందని మాట్లాడుకుంటున్నారు. కోహ్లీ మళ్లీ పగ్గాలు అందుకునేలా ఆర్సిబి ఫ్రాంచైజీని ఒప్పించాలని అంటున్నారు. డుప్లేసిస్ వయసు 39 సంవత్సరాలు అని, విరాట్ వయసు 35 సంవత్సరాలేనని గుర్తుచేస్తున్నారు. డూప్లేసిస్ కంటే కోహ్లీనే మంచి ఆప్షన్ అంటున్నారు. అయితే ఒకసారి కెప్టెన్సీ వదిలేశాక మళ్ళీ రెగ్యులర్ కెప్టెన్ అయ్యేందుకు విరాట్ ఆసక్తి చూపించకపోవచ్చని ఎక్స్పర్ట్ చెబుతున్నారు.

Virat Kohli Returns To Captain RCB Despite

Advertisement

కాకపోతే ఒకటి, రెండు మ్యాచుల్లో కెప్టెన్ గా కనిపించే అవకాశం ఉందంటున్నారు. గత సీజన్ లోను విరాట్ స్టాండింగ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. మూడు మ్యాచుల్లో ఆర్సిబిని నడిపించాడు. కెప్టెన్ గా తనదైన మార్క్ ను చూపించాడు. గత సీజన్లో మూడు మ్యాచుల్లో కెప్టెన్గా వ్యవహరించినందునే ఈసారి జట్టును పూర్తిగా నడిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లీ చేతుల మీదుగా కప్ అందుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందని చెబుతున్నారు. నిజానికి 2008 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతోని విరాట్ ప్రయాణం సాగుతోంది. కెరియర్ తొలిదశ నుంచి ఇప్పటివరకు ఆర్సిబితోనే ప్రయాణం చేస్తున్నాడు. కెప్టెన్ గాను రాయల్ చాలెంజర్స్ తరఫున ఓ వెలుగు వెలిగాడు. కాకపోతే ఒక్కసారి కూడా ఆర్సిబి ఛాంపియన్ గా నిలవలేకపోయింది. అయితే 2022 సీజన్ కు ముందు కెప్టెన్సీ భారాన్ని విరాట్ దక్కించుకున్నారు. ఐపీఎల్ కెప్టెన్సీని వదులుకున్నాడు.

virat kohli new

టీమిండియాకు కెప్టెన్ గా వన్డేలు, టెస్టుల్లోనే కొనసాగాలనుకున్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఒక ఫార్మాట్ కెప్టెన్సీని వదిలేసుకున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం వైట్ బాల్ ఫార్మాట్లో ఒక్కరే కెప్టెన్ ఉండాలని కోరుకుంది. వన్డేల నుంచి విరాట్ ను సైడ్ చేసింది. ఆ తర్వాత గత సౌతాఫ్రికా టూర్ లో టెస్ట్ కెప్టెన్సీని కోహ్లీ వదులుకున్నాడు. అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్లో ప్లేయర్ గానే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ లోను ప్లేయర్గానే ఆస్వాదిస్తున్నాడు. అయితే టీమిండియా కెప్టెన్సీ లేనందున ఎలాగో భారం ఉండదని, ఐపీఎల్లో సారధిగా వ్యవహరించాలనేది అభిమానుల మాట. మరోవైపు డూప్లెసిస్ కెప్టెన్సీలోను ట్రోఫీ గెలిచింది ఏమీలేదు కదా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కెరియర్ చివరిదశలో ఉన్న డూప్లెసిస్ కంటే విరాట్ కే కెప్టెన్సీ ఇచ్చేందుకు ఆర్సిబి ప్రయత్నించాలంటున్నారు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading