Home » నా కెరియర్ లో మొదటిసారి ఇలా జరిగింది..!

నా కెరియర్ లో మొదటిసారి ఇలా జరిగింది..!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అందరి చూపు ఉంది అని చెప్పాలి. మూడేళ్ళుగా సెంచరీ లేకుండా… ఒక్క ఏడాది కాలంగా పరుగులు చేయడనికి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ఎప్పుడు తిరిగి ఫామ్ లోకి వస్తాడా అని భారత క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ కోహ్లీ మాత్ర ఇంగ్లాండ్ పర్యటన తర్వాత జట్టుకు పూర్తిగా దూరంగా ఉన్నాడు.

Advertisement

ఒక్క నెల కంటే ఎక్కువ రోజులు జట్టుకు దూరంగా ఉన్న కోహ్లీ ఇప్పుడు నేరుగా ఆసియా కప్ లోనే పాల్గొనబోతున్నాడు. అందుకే విరాట్ పైనే అందరి ఫోకస్ అనేది ఉంది. అయితే తాజాగా విరాట్ కోహ్లీ తాను ఇలా జట్టుకు నెలకు పైగా దూరంగా ఉండటం పై కామెంట్స్ చేసాడు. ఆసియా కప్ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన విరాట్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Advertisement

నేను ఇలా బ్యాట్ పట్టకుండా నెల రోజులు దూరం ఉండటం గత పది ఏళ్లలో ఇదే మొదటిసారి. ఇలా ఇంతకముందు ఎప్పుడు జరగలేదు. అయితే నేను సరిగ్గా ఆడటం లేదు గ్రహించిన తర్వాత కూడా మళ్ళీ ఫామ్ లోకి రావడనికి ఇంకా క్రికెట్ ఆడాలి అనుకున్నాను. కానీ నా శరీరం అలాగే నా మనసు రెండు కూడా ఆదుకు ఒప్పుకోలేదు. ఇక నేను బయటకి చాలా దూడంగా కనిపిస్తాను. కానీ దానికి ఒక్క లెవల్ అనేది ఉంటుంది. అది అందరూ అర్ధం చేసుకోవాలి అని కోహ్లీ అన్నాడు.

ఇవి కూడా చదవండి :

పాక్ అభిమానుల కల నెరవేర్చిన విరాట్..!

మొదటి భారతీయుడిగా మరో ఘనత సాధించబోతున్న కోహ్లీ..!

Visitors Are Also Reading