Home » Virat Kohli : టీమిండియా క్రికెటర్లలో విరాట్‌ రికార్డు…అత్యంత ఖరీదైన ఇల్లు కోహ్లీదే!

Virat Kohli : టీమిండియా క్రికెటర్లలో విరాట్‌ రికార్డు…అత్యంత ఖరీదైన ఇల్లు కోహ్లీదే!

by Bunty
Ad

మన ఇండియాలో ఏ ఆటకు లేని క్రేజ్ ఒక క్రికెట్కు మాత్రమే ఉంటుంది. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ఎక్కువమంది క్రికెట్ చూసేందుకు.. ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే మన ఇండియాలో.. టీమిండియా క్రికెటర్లు క్రికెట్ ద్వారా చాలానే సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులలో.. బీసీసీఐ చాలా పెద్దది.

Advertisement

అలాగే చాలా ధనవంతమైన బోర్డు కూడా బీసీసీఐనే. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడితే.. సదరు క్రికెటర్లకు కోట్లల్లో డబ్బులు వస్తాయి. అటు ఐపీఎల్ కూడా ఉండనే ఉంది. ఈ ఐపీఎల్ వేలంలో క్రికెటర్ల పై కోట్ల వర్షం కురిపిస్తున్నాయి ఫ్రాంచైజీలు. దీంతో మన టీమ్ ఇండియా క్రికెటర్లు విపరీతంగా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రికెటర్ల సంపాదన పై ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అందరి క్రికెటర్ల కంటే… విరాట్ కోహ్లీ ఎక్కువగా సంపాదిస్తున్నాడని.. అలాగే అత్యంత ఖరీదైన ఇంటిలో విరాట్ కోహ్లీ మాత్రమే ఉంటున్నాడని నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీ ముందు వరుసలో ఉన్నారట. కోహ్లీ ఇల్లు సుమారు రూ. 80 కోట్లు విలువ ఉంటుందని అంచనా. అలాగే యువరాజ్ సింగ్ రూ. 64 కోట్లు, సచిన్ రూ. 35 కోట్లు, గంగూలి రూ. 40 కోట్లు, రోహిత్ శర్మ రూ. 30 కోట్లు విలువ చేసే ఇల్లు కలిగి ఉన్నారని సమాచారం. ఎంఎస్ ధోని మొత్తం ఆస్తి విలువ 100 కోట్లు కాగా…ఇందులో తన ఇంటి విలువ సుమారు రూ. 6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading