Home » విరాట్‌ కోహ్లీ జాతకం వైరల్…ఆ పెను ప్రమాదం తప్పదా!

విరాట్‌ కోహ్లీ జాతకం వైరల్…ఆ పెను ప్రమాదం తప్పదా!

by Bunty
Ad

 

ప్రపంచకప్ లో స్టార్ గా అవతరించడంతో పాటు కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 11 మ్యాచ్ లలో ఆరు అర్థ సెంచరీలు, మూడు సెంచరీలతో 765 పరుగులు చేసిన కింగ్ ఒక వికెట్ కూడా తీశాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ పై చర్చ జరుగుతుంది. ఇప్పుడప్పుడే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం లేనప్పటికీ నెక్స్ట్ ప్రపంచకప్ లో ఆడతాడా? లేదా? అన్నదానిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Virat Kohli Horoscope

Virat Kohli Horoscope

ఈ సమయంలో కోహ్లీకి సంబంధించి జాతకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ను స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ పేరుతో ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. ఆగస్టు 2025 నుంచి ఫిబ్రవరి 2027 లోపు కోహ్లీ ఫామ్ తగ్గుతుందని జ్యోతిష్యం చెబుతోంది. 2022లో కోహ్లీ క్రికెట్ కెరీర్ టాప్ లోకి వెళుతుందని అయితే మార్చి 2028 లోపు రిటైర్ అవుతాడని పోస్టులో పేర్కొన్నారు. విశేషమేంటంటే 2017 ఆఖరిలో అనుష్క శర్మతో కోహ్లీకి వివాహం జరగనుందని జాతకం సూచించింది.

Advertisement

Advertisement

ఫిబ్రవరి 2018 నుంచి సెప్టెంబర్ 2020 లోపు పాప పడుతుందని, పుట్టిన బిడ్డ ద్వారా కోహ్లీకి మహాభాగ్యం కలిగిస్తుందని జాతకంలో ఉంది. 2021 మరియు 2024 మధ్యలో కోహ్లీకి రెండవ సంతానం కలుగుతుందని జాతకం వివరించింది. ఫైనల్ మ్యాచ్ లో ఆసిస్ ఓడిపోయినప్పటికీ ప్రపంచక్రికెట్ లో భారత్ కు ఎన్నో గర్వపడే క్షణాలను అందించాడు కోహ్లీ. ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ లో కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని పూర్తి చేశారు. దీంతో వన్డే ప్రపంచకప్ లో 50 సెంచరీలు బాదినతోలి ప్లేయర్ గా కోహ్లీ రికార్డు సృష్టించారు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading