భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తన ఆగ్రహంయూ చూపిస్తూనే ఉన్నారు. అయితే దాదాపు మూడేళ్ళుగా సెంచరీ చేయకుండా.. ఫేమ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని జట్టు నుండి తప్పించడానికి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ విషయంలోనే విరాట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇక ఈ మధ్యే ఫేమ్ కోల్పోవడంతో బీసీసీఐ కోహ్లీ, రోహిత్, బుమ్రా ఇలా సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ లో కోహ్లీ తన ప్రదర్శన చూపించలేకపోయారు. టెస్ట్ మరియు టీ20 లలో ప్లాప్ అయ్యాడు.
Advertisement
ఇక ఆ సమయంలోనే వెస్టిండీస్ పర్యటన కోసం వన్డే జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మళ్ళీ ఇందులో రెస్ట్ పేరుతో సీనియర్లకు చాలా మందికి విశ్రాంతి ఇచ్చింది. అందులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఈ నిర్ణయంతో కోహ్లీ ఫ్యాన్స్ కు ఆగ్రహం అనేది రావడంతో బీసీసీఐని మళ్ళీ ట్రోల్ చేసారు. అయితే ఈ పర్యటనలో భారత జట్టు టీ20 సిరీస్ లో కూడా పాల్గొనబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ వెల్లడించింది. అయితే వన్డే సిరీస్ లో లేని సీనియర్ ఆటగాళ్లు అందరూ ఈ టీ20 ల్లో ఉన్నారు. ఒక్క విరాట్ కోహ్లీని మినహాయించి.
Advertisement
దాంతో ప్రస్తుతం బీసీసీఐని విరాట్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ అనేది చేస్తున్నారు. అయితే కోహ్లీనే ఈ విండీస్ పర్యటన నుండి మొత్తం రెస్ట్ కావాలని కోరినట్లు… అందుకే బీసీసీఐ విరాట్ ను ఎంపిక చేయలేదు అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం దానిని అంగీకరించలేదు. విరాట్ కోహ్లీ ఇలా ఒక్కేసారి రెండు పర్యటనల నుండి తప్పుకోడు.. రెస్ట్ కోరాడు. బీసీసీఐ కావాలనే కోహ్లీని జట్టులోకి తీసుకోవడం లేదు అని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉంది.. నిజంగానే కోహ్లీ విశ్రాంతి కొరడా.. లేక బీసీసీఐ కావాలని కోహ్లీని తప్పిస్తుందా అనేది మాత్రం తెలియదు.
ఇవి కూడా చదవండి :