Telugu News » Blog » పెళ్ళికి సిద్ధమైన ద్యుతీ చంద్.. ఎవరితో తెలుసా…?

పెళ్ళికి సిద్ధమైన ద్యుతీ చంద్.. ఎవరితో తెలుసా…?

by Manohar Reddy Mano

ద్యుతీ చంద్… టీం ఇండియా యొక్క మహిళా స్ప్రింటర్. అయితే ఈమెకు మొదట్లో చాలా అవమానాలు అనేవి ఎదురయ్యాయి. ఎందుకంటే ద్యుతీ చంద్… లో మగవారికి సంబంధించిన టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆమె గొంతు.. అలాగే శరీర ఆకృతి అనేది అబ్బాయిలలా ఉంటుంది. ఈ కారణంగానే 2014 లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పాల్గొనేందుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే 2018 లో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన ద్యుతీ చంద్.. ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటుంది.

Ads

ఈ క్రమంలో తాజాగా ద్యుతీ చంద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడింది. అయితే ద్యుతీ చంద్ 2019 లోనే మరో అథ్లెట్ అయిన మోనాలిసాతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించింది. కానీ అప్పుడు వీరికి ఎక్కువగా విమర్శలు అనేవే వచ్చాయి. ఎందుకంటే.. ఇద్దరు ఒక్కే జెండర్ కలిగిన వారు పెళ్లి చేసుకోవడం మన ఇండియాలో చాలా అరుదు. అలాగే దీనిని తప్పుగా భావిస్తారు. అందువల్లే అప్పుడు ద్యుతీ చంద్ ను బాగా ట్రోల్ చేసారు. కానీ ఇప్పుడు తనకు ఈ విషయంలో మద్దతు అనేది వస్తుంది అని ద్యుతీ చంద్ పేర్కొంది.

Ads

ద్యుతీ చంద్ మాట్లాడుతూ.. మేము మా రిలేషన్ గురించి ప్రకటించినప్పుడు అందరూ విమర్శించారు. కానీ ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మేము మా రిలేషన్ ను ఇంకా ముందుకు తీసుకెళ్లి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. కానీ మన ఇండియాలో ఇలాంటి పెళ్లిళ్లు చట్టబద్ధం కావు. అయితే మేము ప్రస్తుతం 2024 పారిస్ ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్నాము. కాబట్టి అవి అయిపోయిన తర్వాతే మేము పెళ్లి చేసుకుంటాం. అయితే ఇక్కడ పెళ్లి చేసుకోవాలా.. లేక వేరే దేశంలోనా అనేది నా పార్ట్నర్ ఇష్టం అని ద్యుతీ చంద్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

మ్యాచ్ ను మధ్యలో ఆపేసిన రోహిత్.. ఎందుకో తెలుసా…?

ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీం ఇండియా కొత్త చరిత్ర…!