భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు అనేది తెలిసిందే. ఆడిన 5 మ్యాచ్ లలో మూడు హాఫ్ సెంచరీలు అనేవి చేసి.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దాంతో అందరూ విరాట్ పై ప్రశంసలు అనేవి కురిపిస్తున్నారు. కానీ ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీ పరిస్థితి ఎలా ఉందొ అందరికి తెలుసు.
Advertisement
గత ఏడాది ముగిసిన ప్రపంచ కప్ నుండి విరాట్ కోహ్లీ పరుగులు చేయలేక తంటాలు పడ్డాడు. వరుస వైఫల్యాలతో.. కోహ్లీ ఎన్నో విమర్శలు అనేవి ఎదురుకున్నాడు. ఆ సమయంలోనే కోహ్లీకి ఇక జట్టులో చోటు అనేది ఉండదు అని వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ లో కోహ్లీ ఫెయిల్ అయితే జట్టు నుండి బయటికే అన్నారు. కానీ ఆ టోర్నీలో కోహ్లీ సూపర్ సక్సెస్ అయ్యాడు.
Advertisement
అయితే తాను విమర్శలు ఎదుర్కుంటున్న సమయంలో.. జట్టులో చోటు ఉండదు అని అంటున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచింది కేవలం మహేంద్ర సింగ్ ధోని మాత్రమే అని విరాట్ తాజాగా వెల్లడించాడు. ఆ సమయంలో ధోని ఒక్కడే నాకు మెసేజ్ చేసాడు. మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అనేది ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువ అని విరాట్ చెబుతున్న వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ట్విటర్ లో పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి :