Home » ఆ విషయంలో రూట్ ఐడియా కాపీ కొట్టిన కోహ్లీ..!

ఆ విషయంలో రూట్ ఐడియా కాపీ కొట్టిన కోహ్లీ..!

by Azhar
Ad
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ ఈ దశాబ్దానికి చెందిన గొప్ప ఆటగాళ్లుగా భావిస్తుంటారు. ఈ నలుగురు ఎప్పుడు పరుగులు చేయడం పోటీ పడుతుంటారు. కానీ ప్రస్తుతం మాత్రం ముగిసిన ముగ్గురు కంటే జో రూట్ ఒక్క అడుగు ముందున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు కోహ్లీ, విలియమ్సన్, స్మిత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే రూట్ మాత్రం సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. దాంతో రూట్ కు సంబంధించిన ఓ ఐడియాను తాజాగా విరాట్ కోహ్లీ కాపీ కొట్టాడు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో రూట్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇదిలా ఉంటె.. ఈ సిరీస్ లోని మొదటి మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో రూట్.. తన బ్యాటిం యూక సమతుల్యాన్ని తెలుసుకోవడానికి. క్రీజులో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నప్పుడు.. బ్యాట్ ను నిటారుగా నిలబెట్టి ఉంచాడు. ఆ బ్యాట్ కూడా అలానే ఎటువైపు వంగకుండా నిలుచుంది. ఇదే పద్ధతిని కోహ్లీ కూడా పాటించాడు.
వచ్చే నెల 1 నుండి ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్ట్ మ్యాచ్ కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత జట్టు ఈరోజు వార్మప్‌లో లీసెస్టర్‌షైర్ తో తలపడుతుంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఇందులో కోహ్లీ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్నప్పుడు… రూట్ లాగే తన బ్యాట్ ను కూడా నిలబెట్టాలని ప్రయత్నించాడు. కానీ కోహ్లీ బ్యాట్ ను వదిలేయగానే అది తన వైపుకు వంగింది. దాంతో కోహ్లీ, రూట్ ఫోటోలను పక్క పక్కన బెట్టి ట్రెంగ్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటె ఈ మ్యాచ్ లో 69 బంతులు ఎదుర్కున్న కోహ్లీ 33 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.

Advertisement

Visitors Are Also Reading