Home » ఆసియా కప్ లో రికార్డుల వెంట పడిన కోహ్లీ, రోహిత్..!

ఆసియా కప్ లో రికార్డుల వెంట పడిన కోహ్లీ, రోహిత్..!

by Azhar
Ad

భారత జట్టు ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వరుస మ్యాచ్ లలో రికార్డులు నెలకొల్పుతున్నారు. అయితే ఇందులో పాకిస్థాన్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో రోహిత్ కేవలం 12 పరుగులే చేసాడు. అయిన వాటితోనే అంతర్జాతీయ టీ20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

అలాగే రెండో మ్యాచ్ లో హాంగ్ కాంగ్ పైన 23 పరుగులు చేసిన రోహిత్ మరో ఘనత అందుకున్నాడు. అదేంటంటే.. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ లో 3500 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఫిట్ అనేది ఎవరు సాధించలేదు. రోహిత్ కు ఈ ఫిట్ సాధించడానికి 132 మ్యాచ్ లు అవసరమయ్యాయి. అలాగే ఇదే మ్యాచ్ లో కోహ్లీ కూడా చాలా రోజుల తర్వాత ఓ రికార్డు సాధించాడు.

Advertisement

అయితే ఈ ఆసియా కప్ కు ముందు ఫామ్ లో లేక పరుగులు చేయని కోహ్లీ.. ఈ టోర్నీలో రాణిస్తున్నాడు. హాంగ్ కాంగ్ పైన అయితే 59 పరుగులు చేసాడు. ఇక ఈ అర్ధ శతకంతో పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా 50+ పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరు ఈ ఫిట్ ను 31 సార్లు అందుకోవడం విశేషం.

ఇవి కూడా చదవండి :

రాహల్ పై పగ తీర్చుకున్న పంజాబ్..!

ఆల్ రౌండర్ గా విరాట్ ను వాడండి…!

Visitors Are Also Reading