Home » నా లక్ష్యం అదే… క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ..!

నా లక్ష్యం అదే… క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ..!

by Azhar
Ad

ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఎటు చూసినా కూడా విరాట్ కోహ్లీ గురించే వార్తలు అనేవి కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబంది పడుతున్న కోహ్లీ గురించే అందరూ మాట్లాడుతున్నారు. అయితే అందులో కొంతమంది ఇక విరాట్ కోహ్లీని జట్టు నుండి తప్పించాలని.. అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం అనేది ఇవ్వాలని సూచిస్తున్నారు. కానీ మరికొందరు విరాట్ కు ఇంకా సమయం ఇవ్వాలని.. అతను ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించాడు అని అంటున్నారు. విరాట్ మళ్ళీ తన లయను అందుకుంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

అయితే ఇలా విరాట్ కోహ్లీ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తిగా తేలిపోయిన విరాట్… ఇప్పుడు భారత జట్టు వెళ్లిన వెస్టిండీస్ పర్యటన నుండి తప్పుకున్నాడు. అందువ్ల అతనిపై విమర్శల దాడి అనేది ఇంకా ఎక్కువైంది. కానీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక తాజాగా విరాట్ కోహ్లీ తన టార్గెట్ ఎంతటి అనేది బయట పెట్టాడు. ఇక ఇక్కడే కోహ్లీ చేసిన కామెట్స్ అనేవి అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

Advertisement

ఫామ్ లో లేని ఏ ఆటగాడిని అయినా సరే మీ టార్గెట్ ఏంటి అని అడిగితే.. మళ్ళీ ఫామ్ లోకి రావడం అంటూ సమాధానం ఇస్తారు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ మాత్రం తన లక్ష్యం గురించి మాట్లాడుతూ.. ”భారత జట్టుకు ఆసియా కప్ తో పాటుగా… ప్రపంచ కప్ కూడా అందించడమే నా టార్గెట్. అందుకోసం నేను ఏం చేయడానికి అయిన సిద్ధం” అని పేర్కొన్నాడు. ఇక కోహ్లీ ఇచ్చిన సమాధానం అనేది ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. అందువల్ల మరోసారి అందరూ విరాట్ పై ప్రశంసలు అనేవి కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

క్రేజ్ లో కోహ్లీని కొట్టే వ్యక్తి లేడుగా..!

సంజూనే మ్యాచ్ గెలిపించాడు.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading