Home » 1000 రోజులు పూర్తి చేసుకున్న విరాట్..!

1000 రోజులు పూర్తి చేసుకున్న విరాట్..!

by Azhar
Ad

భారత బ్యాటింగ్ ఐకాన్ విరాట్ కోహ్లీ 1000 రోజులు అనేవి పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మధ్యే విరాట్ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి 14 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ 1000 రోజులు దేనిలో అంటే.. సెంచరీ చేయకపోవడంలో. విరాట్ చివరిగా సెంచరీ అనేది చేసి నేటికీ 1000 రోజులు పూర్తి అవుతుంది. 2019 లో బంగ్లాదేశ్ తో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ లో విరాట్ చిరిగి సెంచరీ చేసాడు.

Advertisement

అది విరాట్ కు 70వ సెంచరీ. అయితే అప్పటికి విరాట్ క్రికెట్ లోకి వచ్చి నాలుగు వేల వంద రోజులు అవుతుంది. అయితే ఇంత సమయంలోనే 70 సెంచరీలు అనేవి చేసిన విరాట్ తన 71వ సెంచరీ కోసం 1000 రోజులు కంటే ఎక్కువ వేచి ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ అసలు ఫామ్ లో లేదు అనే విషయం అందరికి తెలిసిందే.

Advertisement

ఈ ఏడాది ఐపీఎల్ లో పూర్తిగా విఫలమైన కోహ్లీ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో మూడు ఫార్మాట్ లలో గేమ్స్ అనేవి ఆడాడు. కానీ ఆకట్టుకోలేకపోలేదు. ఇక ఆ ఇంగ్లాండ్ టూర్ తర్వాత జరిగిన అన్ని సిరీస్ ల నుండి విరాట్ విశ్రాంతి అనేది తీసుకున్నాడు. ఇప్పుడు ఇండియా ఉన్న జింబాంబ్వే పర్యటనలో కూడా విరాట్ లేడు. నేరుగా ఈ రెస్ట్ తర్వాత 28న ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లోనే బరిలోకి దిగనున్నాడు విరాట్.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ కు గట్టి దెబ్బ.. ఇండియాకు కలిసొస్తుందా..?

భారత జట్టుకు దొరికిన లక్కీ ప్లేయర్‌.. ఉంటె విజయమే..!

Visitors Are Also Reading