Home » Fact Check : అంబానీ ఇంట్లో పార్టీ… టిష్యూ పేపర్ల స్థానంలో కరెన్సీ నోట్లు?

Fact Check : అంబానీ ఇంట్లో పార్టీ… టిష్యూ పేపర్ల స్థానంలో కరెన్సీ నోట్లు?

by Bunty
Ad

రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్టు అయినా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గత శుక్రవారం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇంతవరకు బాగానే ఉన్నా భోజనం తర్వాత అందించిన స్వీట్ ప్లేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతిధులకు ఎంతో ఖరీదైన దౌలత్ కి చాట్ ను సర్వ్ చేశారు.

READ ALSO :  అబ్బాయిలు ఈ లక్షణాలు కలిగి ఉంటే… అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడతారు

Advertisement

వడ్డించడానికి రెడీగా ఉంచిన ఆ స్వీట్ ప్లేస్ లో టిష్యులకు బదులు కరెన్సీ నోట్లు ఉండటం ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. అయితే అవి నిజమైన కరెన్సీ నోట్లు కాదని తేలింది. దౌలత్ కి చాట్ ఢిల్లీ సహా నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన డిజర్ట్. ఈ డిష్ శీతాకాలంలో మాత్రమే రెండు నెలల పాటు లభిస్తుంది. చిక్కటి పాల నుంచి తీసిన నురుగుతో పాటు పిస్తా, కోవా, చక్కెరపొడితో దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు.

Advertisement

READ ALSO : AdiPurush : హనుమాన్ జయంతి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్…

Ambani's party has 500 notes instead of tissue paper': Foodies reveal truth behind viral photo

ఢిల్లీకి చెందిన ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ తో పాటు నకిలీ కరెన్సీ నోట్లను పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దీంతో ఈ వంటకం నార్త్ లో చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు అంబానీ పార్టీలో కూడా డిజర్ట్ ను ఫేక్ కరెన్సీ నోట్లతో సర్వ్ చేశారన్నమాట. ఇందుకు సంబంధించిన ఫోటోను రత్నీష్ అనే నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

READ ALSO : Ravanasura Review : రవితేజ రావణాసుర మూవీ రివ్యూ.. మాస్ మహారాజ్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Visitors Are Also Reading