Home » గ్రామ దేవతలు రాత్రి పూట సంచారం చేస్తారా..!!

గ్రామ దేవతలు రాత్రి పూట సంచారం చేస్తారా..!!

by Sravanthi
Ad

ప్రతి గ్రామానికి ఆ ఊరి పొలిమేరలో గ్రామ దేవత ఆలయం తప్పకుండా ఉంటుంది. గ్రామ దేవతారాధన మన హిందూ సంస్కృతిలో ఒక భాగం. అసలు గ్రామదేవతల ఆవిర్భావం ఎలా జరిగింది? గ్రామ దేవతలు రాత్రిపూట ఊరిలో ఏ రూపంలో తిరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. మన దేశంలోని అన్ని దేవతలను పూజించడానికి వీలు ఉండదు కాబట్టి ప్రతి గ్రామంలో ఒక గ్రామ దేవత నిలుపుతారు. అన్ని దేవతలను గ్రామ దేవత లో చూసుకుని దేవత ను దర్శించుకున్నామనే తృప్తి పొందడానికి గ్రామ దేవత వ్యవస్థను మన పెద్దలు ఏర్పాటు చేశారు. గ్రామ దేవతలు ఊరికి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా, ఎలాంటి భూత ప్రేతాలు ప్రవేశించకుండా గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడుతాయి. గ్రామాల్లోకి రాకుండా పొలిమేరలలోనే ఆగిపోయిన భూత ప్రేత పిశాచాల ఆకలి తీర్చడానికి అమ్మవారి సన్నిధిలో జంతు బలిని ఇస్తారు. పొంగలి,మాంసం, బూరెలు అన్నీ కలిపి అక్కడ నైవేద్యం సమర్పిస్తారు. దీన్నే కుంభం అని అంటారు.దీన్ని భూతాలు ఆహారంగా తీసుకుని శాంతించి ఊరిలోకి ప్రవేశించకుండా అక్కడే ఉండి పోతాయి. అలాగే గ్రామ దేవత రాత్రిపూట వివిధ రూపాల్లో ఊరంతా తిరుగుతూ గ్రామస్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.

Advertisement

ALSO READ:

Advertisement

చిరంజీవిని తిట్టిన గూండాలు…వెంట‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి ఏం చేశాడో తెలుసా..!

మీ పితృదేవతలను మర్చిపోతున్నారా.. అయితే సమస్యల్లో పడ్డట్టే..!!

 

 

 

 

Visitors Are Also Reading