Home » మీ పితృదేవతలను మర్చిపోతున్నారా.. అయితే సమస్యల్లో పడ్డట్టే..!!

మీ పితృదేవతలను మర్చిపోతున్నారా.. అయితే సమస్యల్లో పడ్డట్టే..!!

by Sravanthi Pandrala Pandrala

చనిపోయిన మన తాతముత్తాతలు ఏ లోకంలో ఉన్నారని మీరెప్పుడైనా ఆలోచించారా..వీరిని గుర్తు చేసుకుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చనిపోయిన తర్వాత వారి పుత్రులు అంత్యక్రియలను సక్రమంగా నిర్వహించి, పిండ ప్రధానం చేసిన వారికి మాత్రమే ఉత్తమగతులు కలుగుతాయి.

అలా జరగని వారు ఊర్ధ్వలోకాలకు వెళ్లకుండా, ప్రేతాత్మలై అదో లోకాలకు వెళ్లి అనాధ ప్రేతాత్మ లాగా సద్గతులు పొందకుండా తిరుగుతూ ఉంటారు. చనిపోయిన మన పెద్ద వాళ్లను తలుచుకుంటూ పితృకర్మలు చేసిన వారికి ఎన్నో నోములు వ్రతాలు చేసిన పుణ్యం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది. కొంతమందికి ఏ పని మొదలు పెట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉండడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

ఇలాంటి సమస్యలు బాధిస్తున్నప్పుడు వారికి పితృ సమస్యలు ఉన్నాయని మనం భావించాలి. నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవలెను. ఇలా చేసినా కూడా వారు మన స్థితిని గమనించి ఉన్న దానితో తృప్తి చెంది మనకు మంచి ఫలితాన్ని కలిగిస్తారట.

ALSO READ:

కరోనా తర్వాత మరో ముప్పు…బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు…?

శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక గురించి ఈ రహస్యాలు మీకు తెలుసా..!!

 

 

Visitors Are Also Reading