Home » సూర్య ఖాతాలో విక్రమ్ సినిమా.. విక్రమ్ ఎందుకు తప్పుకున్నాడంటే ?

సూర్య ఖాతాలో విక్రమ్ సినిమా.. విక్రమ్ ఎందుకు తప్పుకున్నాడంటే ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన మూవీ ఏదో ఒక కారణంతో మరో హీరో వద్దకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. కోలీవుడ్ స్టార్ హీరో చేయాలనుకున్న భారీ ప్రాజెక్ట్ మరో హీరో చేతికి వెళ్లింది. ప్రస్టీజియస్ గా ప్లాన్ చేసిన మైథలాజికల్ విజువల్ వండర్, పూర్తిగా కొత్త టీమ్ తో సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఆ మూవీ ఏంటి అనుకుంటున్నారా ?

Advertisement

చియాన్ విక్రమ్ ఫుల్ ఫామ లో ఉన్న సమయంలో ఓ భారీ మైథలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్ఎస్ విమల్ దర్శకుడిగా సూర్యపుత్ర మహావీర్ కర్ణ పేరుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ప్రకటన కూడా చేశారు. ఫార్మల్ లాంచింగ్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ మీద నేషనల్ లేవల్ మంచి బజ్ క్రియేట్ అయింది. కొంత మేరకు షూటింగ్ జరిగిన తరువాత కరోనా కారణంగా సూర్యపుత్ర మహావీర్ కర్ణ ప్రాజెక్ట్ ఆగిపోయింది. బడ్జెట్ భారీగా పెరగడం.. ఈలోపు విక్రమ్ ఇతర ప్రాజెక్ట్స్ తో చాలా బిజీ కావడంతో కర్ణ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా ఇదే కథను తెరమీదికి తీసుకొచ్చే బాధ్యత మరో కోలీవుడ్ హీరో తీసుకున్నాడు. 

Advertisement

పూర్తిగా కొత్త టీమ్ పై ఈ ప్రాజెక్ట్ వర్క్ కొనసాగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాశ్ మెహరా భారీ బడ్జెట్ తో డిఫరెంట్ ట్రీట్ మెంట్ కర్ణుడి కథను సినిమాగా రూపొందించే పనిలో ఉన్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసిన కర్ణ మూవలో నడిప్పిన్ నాయగన్ సూర్య టైటిల్ రోల్ లో నటించబోతున్నారు. రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి క్లాసిక్ మూవీస్ రూపొందించిన దర్శకుడు కావడం.. ప్రజెంట్ సూర్య ఎక్స్ పరిమెంటల్ సినిమాలు చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

దేవి శ్రీ ప్రసాద్ తో మంగ్లీ సిస్టర్ కి పెళ్లి.. వాస్తవమేనా ?

జైలర్ మూవీకి రజినీకాంత్ తో పాటు వారు అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా ?

Visitors Are Also Reading