Home » “విక్ర‌మార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

“విక్ర‌మార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

by AJAY
Ad

సినిమాల్లో ఇత‌ర న‌టీన‌టుల‌తో పాటూ చైల్ట్ ఆర్టిస్ట్ ల‌కు కూడా ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంది. అంతే కాకుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా న‌టించగలిగే చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా అతిత‌క్కువ మంది ఉంటారు. ఇక వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే చైల్డ్ ఆర్టిస్ట్ లు కొంత‌మంది ఉంటే మ‌రి కొంతమంది ఛాన్స్ లు వ‌చ్చినా ప్రూవ్ చేసుకోలేక‌పోతారు. ఇక చేసింది త‌క్కువ సినిమాలే అయినా ప్రేక్ష‌కులకు గుర్తుండి పోయే చైల్డ్ ఆర్టిస్ట్ ల‌లో విక్ర‌మార్కుడు సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒక‌రు.

Advertisement

 

విక్ర‌మార్కుడు సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించ‌గా ఆయ‌న‌కు కూతురుగా క‌నిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ముద్దుముద్దు మాట‌లతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. చిన్న త‌నంలోనే త‌ల్లిని కోల్పోవ‌డంతో ఎప్పుడూ త‌న త‌ల్లి పాడిన జోల పాట‌ను వినుకుంటూ ఉంటుంది. ఈ సీన్ లో చిన్నారి న‌టించిన తీరు ప్ర‌తి ఒక్క‌రి చేత క‌న్నీరు పెట్టించింది. సినిమాకు ఈ ఎమోష‌న‌ల్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.

Advertisement

Also Read:  పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి నిర్మాత‌లు ఎంత లాభం పొందారో తెలుసా..?

ఇక సినిమాలో ర‌వితేజ కూతురిగా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు నేహ తోట‌. ఈ చిన్నారి రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ర‌క్ష సినిమాలో న‌టించి అంద‌ర్నీ బ‌య‌పెట్టింది. ఆ త‌ర‌వాత రాముడు ,అన‌సూయ లాంటి సినిమాల‌లో కూడా న‌టించి అల‌రించింది. ఇక ఆ త‌ర‌వాత నేహ సినిమాల‌కు దూరంగా ఉంది. ఆఫ‌ర్ లు వ‌చ్చినా కూడా స్ట‌డీస్ కోసం సినిమాలను ప‌క్క‌న పెట్టేసింది.

ప్ర‌స్తుతం ఎంబీఏ పూర్తి చేసిన నేహ గుర్తుప‌ట్ట‌రానంత‌గా మారిపోయింది. ఇక ఎప్పుడూ సోష‌ల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే నేహాను సినిమాల‌కు ఎందుకు దూరం అయ్యారు. చూడ్డానికి హీరోయిన్ లా ఉన్నారంటూ చెప్పగా…చ‌దువు పూర్త‌య్యాక సినిమా ఆఫర్ వ‌స్తే చేస్తానంటూ రిప్లై ఇచ్చింది. చూడాలి మ‌రి నేహ రీఎంట్రీ ఇస్తుందా లేదా అని.

Also Read:  మీరు ప్రేమిస్తున్న వారిలో ఈ 5 ల‌క్ష‌ణాలు ఉన్నాయా..? అయితే విడిచిపెట్ట‌డమే బెట‌ర్..!

Visitors Are Also Reading