Home » విక్రమ్ ధ్రువ నక్షత్రం సినిమా డేట్ ఫిక్స్..?

విక్రమ్ ధ్రువ నక్షత్రం సినిమా డేట్ ఫిక్స్..?

by Sravya
Ad

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం సినిమా ఎప్పుడో రావాలి. ముందు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ 2017 లో సూర్య తో ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ ఈ స్క్రిప్ట్ నుండి సూర్య తప్పుకున్నాడు తర్వాత 2017లో విక్రమ్ తో ఈ సినిమాని స్టార్ట్ చేశారు ఆ సంవత్సరమే షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఏడేళ్లు పాటు సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇప్పటిదాకా 6 సార్లు ధ్రువ నక్షత్రం సినిమా వాయిదా పడింది ఈ మూవీ 2023 నవంబర్ 24న రిలీజ్ అవ్వాలి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఓవర్సీస్ లో కొన్నిచోట్ల ప్రీమియర్స్ ని కూడా స్క్రీనింగ్ చేశారు.

Advertisement

Advertisement

ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా మరోసారి వాయిదా పడింది. రిలీజ్ రోజు కూడా ఈ సమస్యలు క్లియర్ చేయడానికి గౌతమ్ మేనన్ ప్రయత్నం చేశారు కానీ పరిష్కారం కాకపోవడంతో సినిమా వాయిదా వేశారు ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి నెలలో ఈ స్పై అండ్ యాక్షన్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఫిబ్రవరి 16 కానీ ఫిబ్రవరి 23న కానీ ఏదో ఒక రోజు మూవీ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading