Home » టాలీవుడ్ టాప్ హీరోల‌ను ప‌క్క‌కు నెట్టి, క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన విజ‌య‌శాంతి 2 సినిమాలు!

టాలీవుడ్ టాప్ హీరోల‌ను ప‌క్క‌కు నెట్టి, క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన విజ‌య‌శాంతి 2 సినిమాలు!

by Azhar
Ad

లేడీ సూప‌ర్ స్టార్ అనే స్క్రీన్ నేమ్ తో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ను సృష్టించుకున్న విజ‌యశాంతి త‌న కెరీర్ లో రెండు సార్లు టాలీవుడ్ టాప్ హీరోల‌ను ప‌క్క‌కునెట్టి హైయెస్ట్ క‌లెక్ష‌న్స్ ను సాధించింది. 1985,1997లో ప్ర‌తిఘ‌ట‌న‌, ఒసేయ్ రాముల‌మ్మ సినిమాల‌తో ఈ ఫీట్ ను సాధించింది.

1985లో ప్ర‌తిఘ‌ట‌న :
1985లో కృష్ణ హీరోగా అగ్ని ప‌ర్వ‌తం, వ‌జ్రాయుధం సినిమాలు, చిరంజీవి అడ‌విదొంగ సినిమాలు సూప‌ర్ హిట్లు అయ్యాయి. కానీ అదే ఏడాది రిలీజైన విజ‌య‌శాంతి ప్ర‌తిఘ‌ట‌న సినిమా 4 కోట్లు క‌లెక్ట్ చేసి 1985 హైయెస్ట్ క‌లెక్టెడ్ మూవీగా నిల్చింది. ఈ సినిమా విజ‌య‌శాంతిని లేడీ సూప‌ర్ స్టార్ గా మార్చింది.

Advertisement

Advertisement

1997 లో ఒసేయ్ రాముల‌మ్మ‌:
చిరంజీవి హిట్ల‌ర్, మాస్ట‌ర్, నాగార్జున అన్న‌మ‌య్య‌, బాల‌కృష్ణ హీరోగా న‌టించిన పెద్ద‌న్న‌య్య., వెంక‌టేష్ ప్రేమించుకుందాంరా సినిమాలు 1997లో సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. కానీ అదే సంవ‌త్స‌రంలో విడుద‌లైన ఒసేయ్ రాముల‌మ్మ 12.5 కోట్లు వ‌సూలు చేసి స్టార్ హీరోల సినిమాల‌ను ప‌క్క‌కు నెట్టి ఆ ఏడాది హైయెస్ట్ క‌లెక్ష‌న్ మూవీగా నిలిచింది.

Visitors Are Also Reading