Home » ‘ది కేరళ స్టోరీ’ మూవీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు

‘ది కేరళ స్టోరీ’ మూవీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు

by Bunty
Ad

వివాదాస్పద చిత్రంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మూవీ ‘ది కేరళ స్టోరీ’. మే 07న దేశవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలపై వ్యతిరేకత వ్యక్తం అయిననేపథ్యంలో దక్షిణాదిలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదలయ్యే థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్ లో యజమాన్యాలు ఈ సినిమాని ప్రదర్శించకూడదని ఆన్ లైన్ టికెట్ బుకింగ్ తొలగించారు.

READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!

Advertisement

The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించిన పశ్చిమ బెంగాల్.. | West Bengal government has banned the movie The Kerala Story - Telugu Oneindia

అయితే ది కేరళ స్టోరీ సినిమా విజయశాంతి కామెంట్స్ చేశారు. ది కేరళ స్టోరీ సినిమాపై కొనసాగుతున్న చర్చలు, వాదవివాదాలు, నిరసనలను గమనిస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా?… అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం కాగా…. ప్రజలకు ఉన్న ఆ విజ్ఞతని కొన్ని వర్గాలు, చివరికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ చేతుల్లోకి లాక్కోవడం దురదృష్టకరం అని ఫైర్ అయ్యారు.

Advertisement

READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్‌ ?

update on The Kerala Story Ott release date | థియేటర్స్‌తో పలు వివాదాలు.. ఓటీటీలోకి ది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!– News18 Telugu

సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ది కేరళ స్టోరీ సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? మనది ప్రజాస్వామిక దేశం… జనం తమ విజ్ఞతతో ప్రభుత్వాలనే ఎన్నుకుంటున్న రోజుల్లో ఒక సినిమాని చూసి, అందులో ఏ అంశాల్ని స్వీకరించాలో… వేటిని తిరస్కరించాలో ప్రజలకి తెలియదని అనుకుంటున్నారా? చివరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ వర్గాలకి భయపడి సినిమా ప్రదర్శనకు ఆటంకాలు సృష్టించడం దారుణం అని అగ్రహించారు. గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలోనూ ఇలాగే కొన్ని వర్గాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండన్నారు రాములమ్మ.

READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!

Visitors Are Also Reading