సూపర్ స్టార్ కృష్ణ కు అప్పట్లో ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిగతా హీరోలతో పోలిస్తే సూపర్ స్టార్ కృష్ణకి ఫాలోయింగ్ కొంచం ఎక్కువే. ఆయన హీరోయిన్ మరియు దర్శకురాలు విజయ నిర్మలతో పెళ్లి అయిన తర్వాత కృష్ణ రేంజ్ మరింత పెరిగిందనే చెప్పచ్చు. వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. భార్యాభర్తలంటే అలా ఉండాలి అన్నంత ఆదర్శంగా ఉండేవారు.
Advertisement
అయితే.. పెళ్లికి ముందు, పెళ్లి అయ్యాక విజయ నిర్మల సూపర్ స్టార్ కృష్ణకు పెట్టిన కండిషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయ నిర్మల గారు మొదటి నుంచే కొంచం మొండిగా ఉండేవారట. తనని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఒప్పుకునేవారు కాదట. ఓ సారి వాణిశ్రీ రమాప్రభ తో కలిసి మాట్లాడుతూ ఉండగా.. విజయ నిర్మల నటించిన దేవదాసు సినిమాకు వెళ్తే దోమలు తప్పితే ఏమీ ఉండవని.. అదే ఏఎన్నార్ నటించిన దేవదాసు అయితే వంద రోజులు పక్కా ఆడుతుందని వ్యంగంగా కామెంట్ చేశారట.
Advertisement
దీనితో బాధపడ్డ విజయ నిర్మల ఆమెతో చచ్చే వరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అంతే కాదు కృష్ణ గారిని కూడా మాట్లాడవద్దని, ఆమెతో కలిసి సినిమాల్లో నటించవద్దని కండిషన్ పెట్టారట. ఓ సారి ఓ సినిమా కోసం వాణిశ్రీ ని హీరోయిన్ గా తీసుకుంటే ఆమె సైన్ చేశారట. దీనితో.. విజయ నిర్మల షూటింగ్ సెట్ కి వెళ్లి మరీ కృష్ణను బలవంతంగా తీసుకొచ్చేశారట. దీనితో.. తప్పక ఆ సినిమాలో సుమన్ ను హీరో గా పెట్టి ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారట.
మరిన్ని..
RRR 2 కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా ? జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!
హరికృష్ణ చివరి కోరిక ఇదేనట..ఇన్నాళ్లకు బయట పడింది !
నయనతార భర్తకు షారూఖ్ ఖాన్ వార్నింగ్.. అందుకోసమేనా ?