Home » తమన్నాతో డేటింగ్ పై విజయ్ వర్మ ఏమన్నారో తెలుసా ?

తమన్నాతో డేటింగ్ పై విజయ్ వర్మ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

 ఇండస్ట్రీలో తనకంటూ ఓ  గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు విజయ్ వర్మ. ఈ హైదరాబాద్ నటుడితో తమన్నా భాటియా గత కొంతకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. 2023 నూతన సంవత్సరం సందర్భంగా గోవాలో వీరిద్దరూ Muద్దులు పెట్టుకుంటున్న ఓ వీడియో కూడా బయటకొచ్చింది.  సోషల్ మీడియాలో  ఇది తెగ వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చిన తర్వాత ఈ జంట ఎక్కడ కలిశారు?  అసలు వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది అంటూ.. నెటిజన్లు ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. తమన్నా, విజయ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. న్యూ ఇయర్ వేడుకలను ముగించుకొని గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో వీరిద్దరూ ఒకరి వెనుక మరొకరు వస్తూ కనిపించారు. అప్పుడు వీరిద్దరూ డేటింగ్ ఉన్న మాట వాస్తవమే అనే విషయం తెలిసింది. 

Also Read :  రాజేంద్రప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడో తెలుసా ? 

Advertisement

ప్రస్తుతం విజయవర్మ ‘దహాద్’ అనే మూవీలో నటించారు. క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన తమ్మన్నాతో డేటింగ్ ఊహాగానాలపై స్పందించారు. దహాద్ టీజర్ లాంచ్ సందర్భంగా తన సహనటుడు గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మను టీజ్ చేశారు. స్టేజి మీదే తమన్నాతో ప్రేమాయణం గురించి అడగడంతో విజయ్ చాలా సిగ్గుపడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  విజయ్ సమాధానం చెప్పకుండా కేవలం సిగ్గుతో అవును అనే సమాధానం మాత్రం చెప్పాడు.  విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇవాళ అమెజాన్ ప్రైమ్ వీడియోలో  విడుదల అయింది. సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య, సోహమ్ షా , మన్యు దోషి సహా పలువురు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 8 ఎపిసోడ్ ల ఎంటర్టైన్మెంట్, టైగర్ బేబీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Advertisement

Also Read :  నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Manam News

తమన్నా, విజయ్ తొలిసారి సుజోయ్ ఘోష్ లస్ట్ స్టోరీస్ 2  షూటింగ్ సమయంలో కలిశారు.  అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలుస్తోంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో వీరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కచేరిలో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ కచేరీకి కార్తిక్ ఆర్యన్, అంగద్ బేడి, నేహా ధూపియా కూడా హాజరయ్యారు. డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళాడు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.  ఆ తరువాత 2023 న్యూ ఇయర్ వేడుకలల్లో గోవా వేదికగా వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. వాస్తవానికి విజయ్ వర్మ హైదరాబాద్  చెందిన వ్యక్తి. అతను పుట్టి, పెరిగింది ఇక్కడే. సినిమా అవకాశాల కోసం ముంబై  కి వెళ్ళాడు. నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.

Also Read :   పూరిని వీడని “లైగర్” చిక్కులు.. ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ఆందోళన

Visitors Are Also Reading