Home » యాక్టర్ రంగనాథ్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..?

యాక్టర్ రంగనాథ్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అలనాటి స్టార్ హీరోలలో రంగనాథ్ కూడా ఒకరు. ప్రస్తుత జనరేషన్ కు రంగనాద్ అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు కానీ అప్పట్లో ఆయన ఎన్నో సినిమాల్లో హీరోగా చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆరడుగుల అందగాడు అమ్మాయిల మనసును దోచిన చంద్రుడిలా ఉండేవారట రంగనాథ్ .. అలాంటి రంగనాథ్ ను ఓ అమ్మాయి ప్రాణంగా ప్రేమించిందట.. మరి ఆ ప్రేమలో సఫలమైందా లేదా అనేది సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు తెలియజేశారు.అదేంటో ఇప్పుడు చూద్దాం.. రంగనాథ్ శారద హీరో హీరోయిన్లుగా ప్రియ బాంధవి అనే సినిమా షూటింగ్ నెల్లూరులో జరుగుతున్న సమయం. నెల్లూరులో ఒక రెడ్డి గారి ఇంట్లో ఈ షూటింగ్ చేస్తున్నారు.

Advertisement

also read:సాయి శంకర్ కాకుండా పూరీకి మ‌రో త‌మ్ముడు ఉన్నాడ‌న్న సంగ‌తి తెలుసా..?

అయితే ఆ రెడ్డి గారికి చక్కని ఒక కూతురు ఉండేదట.. ఆ అమ్మాయికి రంగనాథ్ అంటే మొదటి నుంచి పిచ్చి ప్రేమ. ఇక నెల్లూరులో షూటింగ్ వారి ఇంటి దగ్గరలోనే, దీంతో వాళ్ళ నాన్నగారిని ఒప్పించి రంగనాథ్ కు వారింట్లోనే బస ఏర్పాటు చేశారట.. ఈ విధంగా అమ్మాయి ప్రతిరోజు రంగనాథ్ కు ఎప్పుడు ఏది కావాలన్నా చాలా ఫాస్ట్ గా తీసుకొని వచ్చి ఇచ్చేదట. తనకి ఇష్టమైన టిఫిన్, ఎంతో ఇష్టంగా తినే జున్ను తెప్పించి మరీ రంగనాథ్ కు ఇచ్చేదని రామారావు అన్నారు. అలా షూటింగ్ జరుగుతోంది, ఆ అమ్మాయి రంగనాథ్ పై ఇంకా ప్రేమను పెంచుకుంటుంది. కానీ రంగనాథ్ మాత్రం ఆమెను అంతలా పట్టించుకోవడం లేదు. షూటింగ్ చివరికి వచ్చింది.. ఇక అమ్మాయి మొహం డల్ అయిపోతోంది..

Advertisement

Actor Ranganath 

ఒకరోజు రంగనాథ్ ను అడ్డగించి మరీ ఆ అమ్మాయి తన మనసులోని మాటను చెప్పిందట.. దీంతో రంగనాథ్ ఒక్కసారి ఆశ్చర్యపోయారట. అలా కాదమ్మా నాకు ఇప్పటికే పెళ్లయింది. ఎంతో ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను. నా జీవితంలో మా ఆవిడకు మాత్రమే ఛాన్స్ మరొకరికి లేదంటూ ఆమె మొహం మీద చెప్పారట. ఆమె తర్వాత నా జీవితంలో వచ్చిన రెండవ అమ్మాయివి నువ్వే.. నిన్ను ఎప్పుడూ నేను గుర్తు పెట్టుకుంటాను.మనం మంచి స్నేహితులుగా ఉందాం. మీ ఇంట్లో ఏం జరిగినా నన్ను పిలిస్తే వస్తాను, మా ఇంట్లో ఏం జరిగినా నిన్ను పిలుస్తాను అంటూ చెప్పారట రంగనాథ్.. అలా కొన్నాళ్లకు ఆ అమ్మాయి పెళ్లయిందని, ఆ పెళ్లికి రంగనాథ్ కూడా హాజరయ్యారని ఈమంది రామారావు అన్నారు. అలా వివాహమైన తర్వాత కూడా అమ్మాయి రంగనాథ్ బర్త్డేలకు హాజరై చాలా కాస్ట్లీ గిఫ్టులు కూడా ఇచ్చేదని తెలియజేశారు.. అయితే ఆ అమ్మాయి పేరు బహుశా శ్రావణి అయి ఉండవచ్చని ఈమంది రామారావు అన్నారు.

also read:

Visitors Are Also Reading