Home » కృష్ణ‌తో క‌లిసి అల్లూరిసీతారామ‌రాజు సినిమా చూసిన ఎన్టీఆర్..! ఆ త‌ర‌వాత ఏం అన్నారో తెలుసా..?

కృష్ణ‌తో క‌లిసి అల్లూరిసీతారామ‌రాజు సినిమా చూసిన ఎన్టీఆర్..! ఆ త‌ర‌వాత ఏం అన్నారో తెలుసా..?

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ కృష్ణ మృతితో ఒక‌ప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోల యుగం ముగిసిపోయింది. ఆయ‌న మ‌ర‌ణించిన నాటి నుండి సంబంధిత వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. నెటిజ‌న్లు కూడా కృష్ణ‌కు సంబంధించిన వార్త‌లు తెలుసుకోవ‌డానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా కృష్ణ సోద‌రుడు ఆదిశేష‌గిరి రావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంధ‌ర్బంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

అల్లూరి సీతారామరాజు సినిమా చేసిన త‌ర‌వాత మ‌ళ్లీ నాలుగైదేళ్ల‌కు ఎన్టీఆర్ కూడా ఆ సినిమా చేయాల‌నుకున్నార‌ని చెప్పారు. నిజానికి అల్లూరి సీతారామరాజు సినిమా కంటే ముందే ఆయ‌న సినిమా చేయాల‌నుకున్నార‌ని చెప్పారు. ఆ లోపే కృష్ణ సినిమా చేసి విడుద‌ల చేసార‌ని కానీ త‌ర‌వాత కూడా ఆ సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని చెప్పారు.

Advertisement

అంతే కాకుండా ఆ సినిమా కోసం ప‌రుచూరికి డైలాగ్స్ రాయాల‌ని కూడా చెప్పారని అన్నారు. అయితే ప‌రుచూరి ఒక‌సారి మీరు అల్లూరి సీతారామరాజు సినిమా కూడా చూడండి అంటూ అన్న‌గారికి స‌ల‌హా ఇచ్చార‌ని చెప్పారు.

దాంతో ఓ రోజు వాహిని స్టూడియోలో కృష్ణ‌ను క‌లిసిన ఎన్టీఆర్ బ్ర‌ద‌ర్ మీరు చేసిన అల్లూరి సీతారామ‌రాజు సినిమాను చూపిస్తారా అడిగార‌ని ఆ త‌ర‌వాత స్టూడియోలో ఇద్ద‌రూ క‌లిసి సినిమా చూసార‌ని చెప్పారు. సినిమా చూసిన త‌ర‌వాత చాలా భాగా చేశారు బ్ర‌ద‌ర్. ఇంత‌కంటే ఇంకా ఏముంటుంది తీయ‌డానికి అని చెప్పార‌ని అన్నారు. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్ అల్లూరిసీతామారాజు సినిమా చేయాలనే ఆలోచ‌న మానుకున్నాన‌ని చెప్పారు.

ALSO READ : Savitri birth anniversary:షూటింగ్ స్పాట్ లో చెప్పులతో కొట్టుకున్న వరలక్ష్మి-సావిత్రి..కారణం..!!

Visitors Are Also Reading