Home » నందమూరి హరికృష్ణ స్థానంలో విజయ్ సేతుపతి మూవీ.. ఫ్యాన్స్ కి పండుగే..!

నందమూరి హరికృష్ణ స్థానంలో విజయ్ సేతుపతి మూవీ.. ఫ్యాన్స్ కి పండుగే..!

by Anji
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా కంటే ముందు కళ్యాణ్ రామ్ చాలా సినిమాలు చేసినప్పటికీ నటుడుగా ఈ సినిమాకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతోనే మాస్ ఆడియన్స్ కు కూడా కళ్యాణ్ రామ్ దగ్గరయ్యారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. నవీన్ మేడారం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.


ఇదిలా ఉంటే.. తాజాగా కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాపై నెట్టెంట ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి సినిమా మల్టీ స్టార్లర్ గా రాబోతుందని సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి మరో హీరోగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దయా లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని సమాచారం.

Advertisement


బింబిసారతో కళ్యాణ్ రామ్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్ సేతుపతి తమిళ నటుడు అయినప్పటికీ అన్ని రకాల పాత్రలతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా పక్కా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading