Home » టాలీవుడ్ స్టార్లకు షాక్ ఇస్తున్న విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్…!

టాలీవుడ్ స్టార్లకు షాక్ ఇస్తున్న విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్…!

by AJAY
Ad

పెళ్లి చూపులు సినిమా తో హీరోగా పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతోనే రౌడీ హీరో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వచ్చింది. ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ ని ఓవర్ నైట్ స్టార్ గా చేసింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు సైతం విజయ్ దేవరకొండ దగ్గరయ్యాడు.

vijay dewarakonda

vijay dewarakonda

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. అంతేకాకుండా టాలీవుడ్ లో మిగతా హీరోల కంటే ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో గా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేశారు. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్స్ సైతం విజయ్ దేవరకొండ తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక హీరోగా సక్సెస్ అందుకున్న వెంటనే విజయ్ దేవరకొండ బిజినెస్ లోనూ దూసుకుపోతున్నారు.

Advertisement

Advertisement

vijay dewarakonda balayya

vijay dewarakonda 

ఇప్పటికే విజయ్ దేవరకొండ ఓ మల్టీప్లెక్స్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే రౌడీ హీరో హీరో ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి సినిమాలను సైతం నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also read : గంగోత్రి సినిమాలో చిన్న పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..?

అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తీసుకునే రెమ్యునరేషన్ టాలీవుడ్ హీరోలకు షాక్ కు గురి చేసేలా ఉంది. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ 20 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమాలో షేర్ సైతం అడిగినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఇంత రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ సుకుమార్ తో సినిమాకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading