Telugu News » Blog » “గీత గోవిందం” కాంబో రిపీట్… విజయ్ మరో హిట్ కొట్టేనా?

“గీత గోవిందం” కాంబో రిపీట్… విజయ్ మరో హిట్ కొట్టేనా?

by Bunty
Ads

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోలలో రోజురోజుకు అత్యంత అభిమానుల ఆదరణ పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తీసుకువచ్చి మరింత గుర్తింపు సాధించడం కోసం ముందుకు వెళ్తున్నారు విజయ్ దేవరకొండ. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకొని అమ్మాయిలకు అయితే కలలు రాకుమారుడిగా మారిపోయాడు. అయితే విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తో కాస్త సైలెంట్ అయ్యారు.

Advertisement

Advertisement

అయితే లైగర్ ఇచ్చిన ఫ్లాప్ నుంచి తేరుకునేందుకు విజయ్ కు కాస్త ఎక్కువ సమయమే పట్టింది. సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విజయ్ ఇప్పుడు మళ్ళీ తన స్పీడ్ పెంచేందుకు రెడీ అయ్యాడు. లైగర్ అనుభవంతో ఇకనుంచి కంటెంట్ పై కాస్త ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఈ ఏడాది విజయ్ దేవరకొండ నుంచి ప్రేక్షకులు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆశించవచ్చు. ఎందుకంటే విజయ్ వరుస సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈ రౌడీ మరో కొత్త ప్రాజెక్టుతో ముందుకు రానున్నాడు.

 

Vijay Devarakonda announces his next, to work with Geetha Govinda director Parasuram

అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ కు ఆ రేంజ్ గుర్తింపు తెచ్చిన సినిమా గీతా గోవిందం. ఈ చిత్రంలో రష్మికతో విజయ్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాకు దర్శకుడు పరశురాం. ఇప్పుడు గీత గోవిందం కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో రౌడీ మరోసారి కనిపించబోతున్నాడు. ఈ కొత్త సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

Advertisement

READ ALSO : సింధూరం హీరోయిన్ సంఘవి గుర్తుందా? పెళ్లి తర్వాత ఎలా మారిపోయిందో చూశారా?