Home » విజయ్ దేవరకొండ సినిమాకి ఛత్రపతి తో లింక్…!

విజయ్ దేవరకొండ సినిమాకి ఛత్రపతి తో లింక్…!

by Sravya
Ad

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత సంవత్సరం ఖుషి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏవరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ ని అందుకున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కి సరిగా టైం కలిసి రావట్లేదు. కానీ లాస్ట్ సినిమా ఖుషి కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. సూపర్ హిట్ అవ్వకపోయినా కాస్త పరవాలేదనిపించింది ఈ సినిమా. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తో రాబోతున్నాడు విజయ్. ఇప్పటికే వచ్చిన టీజర్ తో సినిమాలు మీద పాజిటివ్ బజ్ ఉంది.

Advertisement

విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. గీతగోవిందం తర్వాత పరుశురామ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఇది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పీరియాడికల్  జోనర్ సినిమా ని విజయ్ దేవరకొండ చేస్తున్నారు ఆ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనబడుతున్నారు. టాలీవుడ్ లో శ్రీలంక బ్యాక్ డ్రాప్ ని ప్రభాస్ చత్రపతి సినిమాలో ఎంచుకున్నారు.

Advertisement

ఆ సినిమాలో ఒక సంఘటన వలన ప్రభాస్ తన ప్రజలతో కలిసి విశాఖ తీరానికి వచ్చేస్తారు చత్రపతి అప్పట్లో సాలిడ్ హిట్ అయింది. విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమా శ్రీలంక నేపథ్యంలో ఉండబోతోంది చత్రపతి తరహాలో ఈ సినిమా ఉండనుంది. హై వోల్టేజ్ డ్రామా అద్భుతమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నాయి. జెర్సీ సినిమాని స్ఫూర్తివంతమైన కథగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించిన గౌతమ్ విజయ్ చేసే సినిమాలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading