Home » ఆ నిర్మాత వ‌ల్ల ఆరు నెల‌లు అద్దం చూసుకోలేదు…విద్యాబాల‌న్ ఎమోష‌న‌ల్…!

ఆ నిర్మాత వ‌ల్ల ఆరు నెల‌లు అద్దం చూసుకోలేదు…విద్యాబాల‌న్ ఎమోష‌న‌ల్…!

by AJAY
Ad

బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ విద్యా బాల‌న్. ఈ సినిమా త‌ర‌వాత విద్యాబాల‌న్ అన్ని భాష‌ల సినీప్రియుల‌కు సుప‌రిచితురాలు అయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. అయితే విద్యా బాల‌న్ త‌న కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదొడుకుల‌ను కూడా ఎదురుకుంద‌ట‌. విద్యాబాల‌న్ ప్రస్తుతం జ‌ల్సా అనే సినిమాలో న‌టించింది.

Advertisement

ఈ సినిమా విడుద‌ల‌కు ద‌గ్గ‌ర పడుతోంది. ఈ నేప‌థ్యంలో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విద్యా బాల‌న్ త‌న‌కు జ‌రిగిన అవ‌మానాల గురించి మీడియా ముందు బ‌య‌ట‌పెట్టింది. కొంత‌మంది ద‌ర్శ‌కులు త‌మ సినిమాల‌లో అవ‌కాశాలు ఇచ్చేవారని ఆ త‌ర‌వాత కార‌ణం లేకుండానే సినిమా నుండి తీసివేశేవారని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. సినిమా నుండి త‌ప్పించిన విష‌యం మందుగా చెప్ప‌క‌పోవ‌డం ఓ నోటిసు కూడా పంప‌క‌పోవ‌డం బాధ‌గా అనిపించేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Advertisement

అంతే కాకుండా త‌న రూపాన్ని కూడా అవ‌మానించేవార‌ని చెప్పింది. ఓ నిర్మాత త‌న అందం గురించి మాట్లాడుతూ దారుణంగా అవ‌మానించాడ‌ని తెలిపింది. దాంతో తాను ఆరు నెల‌ల పాటూ అద్దం చూసుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇంటివ‌ర‌కూ ఏడ్చుకుంటూ వెళ్లిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని తెలిపింది. అయితే తాను స్టార్ గా మారిన త‌ర‌వాత అవ‌మానించిన‌వాళ్లే డేట్స్ కోసం వ‌చ్చారని కానీ తాను న‌టించ‌న‌ని చెప్పాన‌ని తెలిపింది.

Visitors Are Also Reading