Home » వీడియో : బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ఎలా కూలిందో తెలుసా.. !

వీడియో : బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ఎలా కూలిందో తెలుసా.. !

by Bunty
Ad

తమిళనాడు రాష్ట్రంలోని.. కూనురు సమీపంలో ఆర్మీ కి సంబంధించిన హెలికాప్టర్ నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదం లో భారత తొలి సి డి ఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా ఏకంగా 13 మంది మరణించారు. దీంతో దేశం మొత్తం విషాదం లోకి నెట్టివేయబడింది. ఈ వార్త వినగానే దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో 14 మంది ఉండగా అందులో 13 మంది మరణించడం విషాదకరం. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై.. అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

 

Advertisement

ఇలాంటి తరుణంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెలిక్యాప్టర్ కూలడానికి కొన్ని సెకన్ల ముందు చోటుచేసుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రమాదం చోటు చేసుకోవడానికి… ముందు ఏం జరిగిందనే దానిపై ఈ వీడియోలో మనకు కొన్ని దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతవరకు బాగానే ప్రయాణించిన హెలికాప్టర్ ఉన్నట్లుండి పొగమంచులో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement

హెలికాప్టర్ పొగ మంచులో చిక్కుకున్న సమయంలో కొందరు జనాలు ఉన్నారు. వారికి హెలికాప్టర్ కూలిన శబ్దం మాత్రం వినిపించింది. ప్రమాదం గురించి వారు తమిళ భాషలో మాట్లాడుకోవడం ఈ వీడియోలో రికార్డు అయింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ప్రమాదంపై నెలకొన్న అనుమానాలు అందరికి తొలగిపోయాయి. ఈ కార్డు బ్లాక్ బాక్స్ దొరకడంతో విచారణ మొదలు పెట్టింది దర్యాప్తు బృందం.

Visitors Are Also Reading