Home » ఒకప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి ఈ బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారా? ఒకవేళ చేసి ఉంటె?

ఒకప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి ఈ బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారా? ఒకవేళ చేసి ఉంటె?

by Srilakshmi Bharathi
Ad

వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రాలు కలిసి నటించిన వెబ్ సిరీస్ “అతిధి”. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. భరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రవీణ్ సత్తారు నిర్మించారు. ప్రవీణ్ సత్తారు షోరన్నర్ కూడా. తన ఇటీవలి మీడియా ఇంటరాక్షన్‌లో, వేణు ఈ వెబ్ షోలో నటించిన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అవ్వడంతో ఎక్కడ చూసిన వేణు తొట్టెంపూడి గురించిన వార్తలే కనిపిస్తున్నాయి.

Advertisement

వేణు తొట్టెంపూడి తన “అతిధి” వెబ్ సిరీస్ గురించి స్పందించారు. ఈ వెబ్ సిరీస్ కు మిశ్రమ స్పందన వస్తోందని, క్లాస్‌గా ఉందని కొందరు, మాస్ ఎలిమెంట్స్ లేవని కొందరు అంటున్నారు. అతిధి నా అభిప్రాయం ప్రకారం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో కామెడీ, సస్పెన్స్, డ్రామా, సెంటిమెంట్ ఉంటాయి. కానీ ఇందులో భయానక అంశాలు తక్కువగా ఉన్నాయి, అందువల్ల కుటుంబ సభ్యులు కలిసి హాయిగా దీన్ని వీక్షించవచ్చు అని వేణు చెప్పుకొచ్చారు.

Advertisement

venu thottempudi

venu thottempudi

ఇంకా ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న వేణు తొట్టెంపూడి గతంలో తాను రెండు సినిమాలను మిస్ చేసుకున్నానని తెలిపారు. గతంలో అతడు సినిమాలో కూడా నాకు అవకాశం వచ్చింది. ఆ సినిమాలో సోనూసూద్ క్యారక్టర్ ను నేనే చేయాల్సి ఉందని.. కానీ, అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయానని అన్నారు. అలాగే దేశముదురు సినిమాలో కూడా అవకాశం వచ్చిందని.. కానీ చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. కొన్ని అవకాశాలు మిస్ అయినందుకు ఏ మాత్రం బాధపడడం లేదని చెప్పుకొచ్చారు. అతిధి వెబ్ సిరీస్ కంటెంట్ నచ్చి ఇందులో నటిస్తున్నా.. నా మీద నమ్మకం ఉంచి ఓ కొత్త దర్శకుడు వచ్చినప్పుడు న్యాయం చేయాలనీ అనిపించిందన్నారు. ప్రస్తుతం చాయ్ బిస్కట్ వాళ్లతో కలిసి పని చేస్తున్నాని.. ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పుకొచ్చారు.

మరిన్ని..

ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు..MP గా పోటీ చేస్తారా ?

విజయ్ ఆంటోనీ తన కూతురుతో చివరగా మాట్లాడిన మాటలు ఇవే.. ఏమన్నారంటే?

Trisha : పెళ్లైన నిర్మాతతో హీరోయిన్ త్రిష వివాహం..?

Visitors Are Also Reading