Home » సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి సీక్రెట్ లవ్ స్టోరీ..!!

సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి సీక్రెట్ లవ్ స్టోరీ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా నటుల జాతకాలు చెప్తూ చాలా ఫేమస్ అయ్యారు వేణు. ఇటీవల కాలంలో ఆయన పేరు చాలా మార్మోగిపోతోంది. అయితే తాజాగా ఆయన లవ్ స్టోరీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అనగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది సెలబ్రిటీల జాతకాలు. సినీనటుల జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఆయన అప్పట్లో నాగచైతన్య సమంత ఎక్కువ కాలం వైవాహిక జీవితం ఉండదని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నాలుగు సంవత్సరాలు తిరగకముందే చైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రముఖ హీరోయిన్ అనుష్క, రకుల్,రష్మిక, వివాహం అచ్చి రాదంటూ కూడా వేణు స్వామి కామెంట్లు దుమారం లేపాయి.

Advertisement

ఈ విధంగా ఇండస్ట్రీలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలతో హార్ట్ టాపిక్ గా మారారు వేణు స్వామి. ప్రస్తుతం ఆయనకి సంబంధించిన రొ**టిక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటో చూద్దాం.. తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వేణు స్వామి.. ఒక అమ్మాయి తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారట. అయితే వేణు స్వామి సతీమణి మరెవరో కాదు వీణా వాయించడం ద్వారా పాపులర్ అయినా శ్రీవాణి.. అందంగా వీణ వాయిస్తూ దానినే తన ఇంటిపేరుగా మార్చుకున్న శ్రీవాణి. వేణు స్వామి భార్య అని చాలా తక్కువ మందికి తెలుసు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వాణిశ్రీ వేణు స్వామితో తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టింది. వారి లవ్ స్టోరీ గురించి సీక్రెట్ రివీల్ చేసింది. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ ఆ అని యాంకర్ అడగగా వాణిశ్రీ సిగ్గుపడుతూ అవును అని చెప్పింది. మీరేమో సన్నగా అందంగా ఉన్నారు అని యాంకర్ అడగగా..

Advertisement

మా ఆయన తిరుపతి లడ్డు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ముందుగా నాకు ఆయనే ప్రపోజ్ చేశారు. ఒకరోజు తన కజిన్ డాటర్ ని తీసుకెళ్లడానికి ఆయన మా ఇంటికి వచ్చారు. అప్పుడు నన్ను చూసి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పారట. అలా అలా మా ఇద్దరి మధ్య సెట్ అయిపోయి పెళ్లి కూడా జరిగింది. నా భర్త సలహాతో సినిమా పాటలు కూడా చేయడం ప్రారంభించా. ఈ విధంగా నాకు వీణ శ్రీవాణిగా గుర్తింపు వచ్చింది. నేను అందానికి ప్రాధాన్యత ఇవ్వను అని చెప్పినా వీణా శ్రీవాణి.. మా ఆయనను తిరుపతి లడ్డు అని పిలుస్తానని చెప్పుకొచ్చింది. వాణిశ్రీ కి సోషల్ మీడియాలో మిలియన్స్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు.

also read:

Visitors Are Also Reading