Home » “సార్” సినిమాలోని ఆ సీన్ తో త్రివిక్ర‌మ్ లైఫ్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

“సార్” సినిమాలోని ఆ సీన్ తో త్రివిక్ర‌మ్ లైఫ్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

by AJAY
Ad

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన సార్ సినిమా విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు తెలుగు డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎడ్యుకేష‌న్ సిస్టం ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటూ త‌మిళంలో కూడా విడుద‌ల చేశారు. కేవ‌లం మూడు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల‌ను వ‌సూళు చేసింది. ఇక ద‌గ్గ‌ర‌లో ఎలాంటి సినిమాల విడుద‌ల లేక‌పోవ‌డంతో ఈ సినిమాకు లాంగ్ ర‌న్ లో క‌లెక్ష‌న్స్ జోరుగా వ‌స్తాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్ర‌మ్ కూడా భాగ‌స్వామ్యులు అయ్యారు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఆసక్తిక‌ర కామెంట్ లు చేశాడు. సినిమాకు త్రివిక్ర‌మ్ గారు కూడా నిర్మాత‌గా వ్య‌హ‌రించారని చెప్పారు. అంతే కాకుండా నిర్మాత‌గానే కాకుండా ర‌చ‌యిత గా కూడా ఆయ‌న కొన్ని స‌ల‌హాలు ఇచ్చార‌ని తెలిపారు.

Advertisement

తాను రాసుకున్న క‌థ‌లో ధ‌నుష్ తండ్రి పాత్ర చిన్న‌ద‌ని కానీ ఆ పాత్ర‌ను త్రివిక్ర‌మ్ పెంచ‌మ‌న్నార‌ని అన్నారు. హీరో త్రండ్రి పాత్ర‌లో పిల్ల‌ల‌కు అడిగింది కొనివ్వ‌క‌పోతే వాళ్లు ఒక్క‌రోజే ఏడుస్తారు. కానీ త‌మ ప‌రిస్థితి మారేవర‌కూ తల్లిదండ్రులు ఏడుస్తారు…అని చెబుతాడు. అయితే నిజానికి ఆ డైలాగ్ మ‌రియు ఘ‌ట‌న త్రివిక్ర‌మ్ నిజ‌జీవితంలో జ‌రిగాయ‌ని అన్నారు. త్రివిక్ర‌మ్ ను ఇంజ‌నీరింగ్ చ‌దివించలేక ఆయ‌న తండ్రి అలా అన్నారని చెప్పారు.

ALSO READ: ఆస్పత్రి బెడ్ పైనే వధువుకు తాళి కట్టిన వరుడు..వీడియో వైరల్‌

Visitors Are Also Reading