Home » Venu Swamy : విడాకుల బాటలో మెగా జంట నడవనుందా..?

Venu Swamy : విడాకుల బాటలో మెగా జంట నడవనుందా..?

by Bunty
Ad

 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ తేజ మరియు లావణ్య త్రిపాఠి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడెప్పుడో ఏడు సంవత్సరాల కిందట వరుణ్ తేజ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఇటీవల పెళ్లి కూడా జరిగిపోయింది. నవంబరు ఒకటవ తేదీన ఇటలీ లో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ వివాహం చాలా గ్రాండ్గా జరిగింది.


ఈ వివాహానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అలాగే లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో నవంబర్ 5వ తేదీన చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం వీరు హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

varun-tej-lavanya-tripathi-honey-moon-place-bali-city-in-indonesia-

varun-tej-lavanya-tripathi-honey-moon-place-bali-city-in-indonesia-

అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత తరహాలోనే లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ విడిపోతారని కుండబద్దలు కొట్టి చెప్పారు వేణు స్వామి. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జాతకాలు సరిగా లేవని… గ్రహాల లోపాలు ఉన్నాయని… అందుకే వీరి కాపురంలో గొడవలు కచ్చితంగా వస్తాయని వేణు స్వామి చెప్పారు. దీంతో వేణు స్వామి పై మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు చెప్పిన జాతకం ప్రకారం భారత రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించలేదు… తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది అని గుర్తు చేస్తూ వేణు స్వామి పై ట్రోలింగ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading