Home » RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం

RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం

by Bunty

 

తెలుగు సినిమాకు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 100 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారం కావడంతో యావత్ దేశం ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గర్వపడుతోంది. మొదటినుండి ఆర్ఆర్ఆర్ కు ఏదో ఒక విభాగంలో ఆస్కార్ పక్క అని విశ్లేషకులు అంచనా వేశారు.

read also : NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

 

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను చాలా తక్కువగా చేసి చూపించారని, రామ్ చరణ్ పాత్రకే ప్రాధాన్యత ఇచ్చారంటూ ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. ఇక ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా ఏకంగా హాలీవుడ్ హోస్ట్ ఎన్టీఆర్ పాత్రను సైడ్ క్యారెక్టర్ అంటూ సంబోధించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వీడియోపై యాంకర్ వ్యవహార శైలిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కూడా ఓ న్యూస్ డిబేట్లో పాల్గొని ఎన్టీఆర్ పాత సైడ్ క్యారెక్టర్ అంటూ పదేపదే నొక్కి చెప్పడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

READ ALSO : తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టరే... సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు  స్వామి | NTR is the side character in RRR movie Venu Swamy made sensational  comments ,Chitti Babu ,RRR ...

ఈ క్రమంలోనే కొందరు గతంలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాట్లాడినటువంటి వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ పాత్ర తరహాలు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉందని, ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ హీరోగా కాకుండా సైడ్ క్యారెక్టర్ గా నటించారు అంటూ గతంలో వేణు స్వామి చేసినటువంటి వాక్యాలకు సంబంధించిన వీడియోని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

READ ALSO : అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారు.. రెహమాన్ కామెంట్స్ వైరల్!

Visitors Are Also Reading