Telugu News » Blog » అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారు.. రెహమాన్ కామెంట్స్ వైరల్!

అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారు.. రెహమాన్ కామెంట్స్ వైరల్!

by Bunty
Published: Last Updated on
Ads

తెలుగు సినిమాకు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 100 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారం కావడంతో యావత్ దేశం ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గర్వపడుతోంది. మొదటి నుండి ఆర్ఆర్ఆర్ ఏదో ఒక విభాగంలో ఆస్కారం పక్కా అని విశ్లేషకులు అంచనా వేశారు. అసలు ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడం వెనుక పెద్ద కథ ఉందని చెప్పవచ్చు.

Advertisement

read also : NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

Advertisement

 

ఈ ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా ఆదరణ పొందింది. అంతేకాకుండా ఆస్కార్ కు వెళ్లే అర్హత ఉండడంతో భారత ప్రభుత్వం ఈ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఆస్కార్ కు పంపిస్తుందని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని గుజరాతి చిత్రమైన లాస్ట్ ఫిలిం షోని ఆస్కార్ నామినేషన్ కు పంపారు. కానీ ఆ చిత్రం ఆఖరి బరిలో స్థానం దక్కించుకోలేక వెనక్కి వచ్చింది. కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం వెనకడుగు వేయకుండా సొంతంగా ఆస్కార్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యి రికార్డు సృష్టించింది.

READ ALSO : తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

Golden Globes 2023: AR Rahman Calls RRR Win a Paradigm Shift

అంతేకాదు ఆస్కార్ తీసుకునే వరకు వెనక్కు తిరగలేదు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించారు. మన చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి వస్తున్నాయి. అర్హత లేనటువంటి చిత్రాలను ఆస్కార్ కి పంపిస్తున్నారని అనిపిస్తోందని బాధపడ్డారు. ఇలా జరుగుతుంటే చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

READ ALSO : Iratta Movie : దుమ్ము లేపుతున్న “ఇరట్ట” చిత్రం మీరు చూశారా?