Home » ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి అయిన వెంటనే అది జరగడం పక్కా..!

ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి అయిన వెంటనే అది జరగడం పక్కా..!

by Anji
Ad

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరమే లేదు.  సినీ సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన చాలా పాపులర్ అయ్యాడు.  ఇప్పటికే చాలామంది హీరో, హీరోయిన్ల జాతకం చెప్పగా.. వారి జాతకాలు చాలా వరకు వాస్తవం జరిగాయి.  అయితే వేణు స్వామి తాజాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఏ సినిమా విడుదల అయినా ఆయన దానికి ముందు కామెంట్స్ చేయడం సాధారణం. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ ముందు కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అంతేకాదు ప్రభాస్ తో సినిమాలు తీయాలి అనుకున్న వారు కచ్చితంగా జాతకం చూపించుకోవాల్సిందే అంటూ బాంబు పేల్చారు. లేకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి రాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.తర్వాత విడుదలైన ఆది పురుష సినిమా కూడా నెగటివ్ టాప్ తెచ్చుకోవడం తో మరోసారి సోషల్ మీడియాలో తన వివాదాస్పద కామెంట్లతో రెచ్చిపోయాడు. ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఎంతోమంది జాతకాలు చూశాను. కానీ తనలాంటి జాతకం చూడలేదు. ఆయన జాతకంలో పాము ఉంది. కానీ ప్రభాస్ జాతకాలను నమ్మడు. అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ కాదు.

Advertisement

 

Venu Swamy

Venu Swamy

ప్రభాస్ ది మాత్రమే కాదు.. దర్శక ధీరుడుగా పేరొందిన రాజమౌళి జాతకం కూడా అలాగే ఉంది. ప్రభాస్ తో సినిమా తీసే ముందు నిర్మాతలు ఒకసారి తమ జాతకం కూడా చూపెట్టుకుంటే మంచిది. లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ప్రభాస్ జాతకంలో ఉన్న దోషం కారణంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ ఎక్కువ కాలం నిలబడవు. తర్వాత ప్రభాస్ పెళ్లి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. పెళ్లి ఆలస్యం అవుతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా అనేక సమస్యలు ఎదురవుతాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

విక్రమ్ సినిమాలో సంతానం గ్యాంగ్ మెంబర్ గా నటించిన మరగుజ్జు మనిషి రేంజ్ గురించి మీకు తెలుసా ? 

రాజమౌళి కి జగపతిబాబు కి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా ?

 

Visitors Are Also Reading