తెలుగుసినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి. భారీ చిత్రాలతో రాజమౌళి సినీప్రియులను అలరిస్తున్నారు. డిఫరెంట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్ ను వేసుకున్నారు. బాలీవుడ్ తారలు సైతం ఆయనతో సినిమాలు చేయాలని చెప్పుకునే రేంజ్ కు రాజమౌళి ఎదిగారు.
మగధీర, ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో జక్కన్న దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా కూడా రాజమౌళికి గుర్తింపు ఉంది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడం ఆ సినిమాలు వేల కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం ఒక్క రాజమౌళికే సొంతం అని చెప్పాలి.
Advertisement
Advertisement
ఇదిలా ఉంటే రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ ఆకాశవాని అనే సినిమాను నిర్మించారు. ఇదిలా ఉండగా కార్తికేయ గతేడాది వివాహం చేసుకున్నారు. తన స్నేహితురాలు పూజా ప్రసాద్ ను కార్తికేయ వివాహం చేసుకోగా వీరి వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పూజా ప్రసాద్ మరెవరో కాదు.
టాలీవుడ్ హీరోగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం విలన్ పాత్రలు చేస్తున్న జగపతి బాబుకు మేనకోడలు అవుతుంది. పూజా ప్రసాద్ కూడా సింగర్ కావడం విశేషం. ఇక ప్రస్తుతం కార్తికేయ రాజమౌళి చేస్తున్న సినిమాలకు సంబంధించిన పనులను కూడా దగ్గరుండి చూసుకుంటారు. ఇదిలా ఉంటే రాజమౌళి లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్దంగా ఉంది.
Also Read: ఆర్ఆర్ఆర్‌కు వరుసగా శుభవార్తలు..!