Home » Chiranjeevi: వెంకీ మామ చెయ్యాల్సిన సినిమాతో హిట్ కొట్టిన మెగాస్టార్ !

Chiranjeevi: వెంకీ మామ చెయ్యాల్సిన సినిమాతో హిట్ కొట్టిన మెగాస్టార్ !

by Anji
Ad

సీనియర్ హీరోల ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతో పడుతూ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా ఎవరి సినిమాలతో వారు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్నారు. అటు బాలయ్య వీరసింహారెడ్డి తో అలరించారు. వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నారు. నాగార్జున కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ నలుగురు హీరోలు ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

chiranjeevi-and-venkatesh-photos

chiranjeevi-and-venkatesh-photos

 

అయితే వెంకటేష్ నటించాల్సిన సినిమాను చిరంజీవి చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..?  బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో మున్నా బాయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో సంజయ్ దత్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమాను తెలుగులో శంకర్ దాదా అనే టైటిల్ తో చిరంజీవి రీమేక్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిరంజీవి. ముఖ్యంగా చిరంజీవి, శ్రీకాంత్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్లు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఏటీఎం క్యారెక్ట్ లో శ్రీకాంత్ లీనమైపోయారు.

Advertisement

అయితే ఈ సినిమాని తొలుత విక్టరీ వెంకటేష్ చేయాలనుకున్నారట. అందుకోసం మున్నా బాయ్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఫ్యాన్సీ రేటుకి ఆల్ ఇండియన్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా  ప్రారంభించాలని అనుకున్నారు. అంతలోనే అసలు  ఏం జరిగిందో తెలియదు. కానీ  ఈ సినిమాకి  హీరో, నిర్మాత,  డైరెక్టర్ ఇలా అందరూ మారిపోయారు.  వెంకటేష్  ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమాను మెగాస్టార్  చిరంజీవి రీమేక్ చేసి సూపర్ హిట్  కొట్టేశాడు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading